దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి జడలు విప్ప కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలపై ఆంక్షలను పోడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లాక్ డౌన్ విధించిన తరువాత మే 25 నుంచి దేశీయ విమానాలు పలు ఆంక్షల నడుమ తమ సేవలను అందించేందుకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఐ) అదేశాలను జారీ చేసింది. అయితే ఆ ఆంక్షలు ప్రస్తుతం దేశీయంగా కోవిడ్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో నవంబర్ 24 వరకు పొడిగించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో దేశీయ విమాన ఛార్జీలపై గతంలో విధించిన నియంత్రణ కూడా నవంబర్ 24 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అమలులో ఉంటుందని తెలిపింది. కరోనా వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. ఈ ఏడాది దీపావళి నాటికి దేశీయ విమానాల సంఖ్య గతంతో పోలిస్తే 55 – 60 శాతానికి చేరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి ఇటీవల వెల్లడించారు. దేశీయ వాయు రవాణాలో నిరంతర మెరుగుదల ఉందని ఆయన అన్నారు,
మే 25 న విమానాలలో ఎక్కిన 30,000 మంది ఫ్లైయర్స్ తో పోల్చితే.. జూలై ఆరంభంలో ఇది రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు, రెండు నెలల సస్పెన్షన్ తర్వాత ఈ రంగాన్ని దశలవారీగా తిరిగి ప్రారంభించడం ప్రారంభమైంది. దేశీయ రంగాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో భాగంగా, గతంలో అనుమతించిన 33% విమాన కార్యకలాపాల సామర్థ్యాన్ని 45% కి పెంచాలని మంత్రిత్వ శాఖ గత నెలలో క్లియర్ చేసింది. మే 21 న ఆమోదించిన ఉత్తర్వులలో దేశీయ విమానాలను కేంద్రం ఆమోదించినా.. వేసవి షెడ్యూల్ లో మూడో వంతుకు పరిమితం చేసింది. దేశీయ విమాన ఛార్జీలపై గతంలో విధించిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more