SBI Circle Based Officer Recruitment 2020 ఎస్.బి.ఐలో ఉద్యోగాలు.. సిబిఒ పోస్టులకు ధరఖాస్తుల ఆహ్వానం..

Sbi cbo recruitment 2020 apply for 3850 circle based officer posts

SBI Circle Based Officer Recruitment 2020, sbi circle based officer jobs, sbi jobs, sbi job in Telangana, sbi job vacancy 2020, sbi job vacancy in Hyderabad, sbi recruitment, sbi recruitment 2020, sbi jobs recruitment 2020 apply online, sbi new job recruitment 2020

SBI CBO Recruitment 2020: State Bank of India (SBI) has invited online applications for the 3850 Circle Based Officer (CBO) posts on its official website-sbi.co.in. Interested and eligible candidates can apply for SBI CBO Recruitment 2020 on or before 16 August 2020.

ఎస్.బి.ఐలో ఉద్యోగాలు.. సిబిఒ పోస్టులకు ధరఖాస్తుల ఆహ్వానం..

Posted: 07/30/2020 04:14 PM IST
Sbi cbo recruitment 2020 apply for 3850 circle based officer posts

భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) బ్యాంకులో స్కేల్ వన్ అధికారుల పోస్టుల నియామకాలకు అర్హులైన వారి నుంచి ధరఖాస్తులను కోరుతోంది. సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ (సీబీఓ) పోస్టుల నియామకానికి తొలిసారిగా ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 9 సర్కిళ్లలో 3850 సిబిఒ ఖాళీలు ఉన్నాయని.. వాటిని అర్హైలైన వారితో భర్తీ చేసేందుకు అహ్వానాలను కోరుతోంది. వీటిలో హైదరాబాద్‌ సర్కిల్ పరిధిలో 550 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన సర్కిల్ లో పోస్టుల కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సర్కిళ్ పరిధిలో ఏకంగా 12 ఏళ్ల పాటు పనిచేసే వీలు కల్పిస్తూ.. ఎస్బీఐ ఈ సిబిఒ పోస్టులను విడుదల చేసింది. గ్రామీణ, సహకార బ్యాంకుల్లో ఆఫీసర్‌ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకు కార్యకలాపాలపై అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి ఈ ధరఖాస్తులను కోరుతోంది. దీంతో శిక్షణాకాలం కూడా కలసివస్తోందని, ఇక కార్యాకలాపాల నిర్వహణలోనూ వేగం వుంటుందని ఎస్బీఐ ఈ విధమైన నియామకాలను చేపడుతోంది. సాధారణంగా బ్యాంకుల్లో ఎలాంటి ఆఫీసర్‌ ఉద్యోగాలైన ప్రతి మూడేళ్లకూ ఏ సర్కిల్ లోని బ్రాంచికైనా బదిలీ అవుతారు. అయితే సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు (సీబీఓ) తాము ఎంచుకున్న సర్కిల్‌లోనే పన్నెండేళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంది. ఇలా ఎంపికైనవారికి పదోన్నతులు కూడా ప్రొబేషనరీ ఆఫీసర్లగా నియమితులైనవారి మాదిరిగానే ఉంటాయి. ఇలా ఎన్నో అనుకూలతలు ఉన్న ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ తగిన విధంగా సన్నద్ధమైతే విజయం సాధించవచ్చు.

ఇవీ ప్రత్యేకతలు

 

* అభ్యర్థులు ఏదో ఒక సర్కిల్‌కే దరఖాస్తు చేసుకోవాలి.

* ఎంపికైన వారికి బేసిక్ పే రూ.23,700. అన్ని అలవెన్సులూ కలుపుకుని రూ.40 వేలకు పైగా వేతనం.

* స్కేల్‌ 4 ఆఫీసర్‌ స్థాయికి చేరుకునే వరకు లేదా 12 ఏళ్ల వరకు ఒకే సర్కిల్ లో సేవలు.

* ప్రొబేషన్‌ వ్యవధి 6 నెలలు. ఆ తరువాత స్కేల్‌ -1 ఆఫీసర్ల ర్యాంకులో కోనసాగింపు.

వయోపరిమితి: ఆగస్టు 1, 2020 నాటికి వయసు 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

పోస్టు: సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 3850. వీటిలో 550 హైదరాబాద్‌ సర్కిల్‌లో ఉన్నాయి.

విద్యార్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత

అనుభవం: ఆగస్టు 1, 2020 నాటికి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్‌ స్థాయిలో కనీసం రెండేళ్లు సర్వీస్‌ పూర్తిచేసుకోవాలి.

వయసు: ఆగస్టు 1, 2020 నాటికి గరిష్ఠంగా 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.750. ఇతర వర్గాలవారు ఫీజు చెల్లించనవసరం లేదు

చివరి తేదీ: ఆగస్టు 16

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టు, ఇంటర్వ్యూ ద్వారా. అవసరమైతే రాత పరీక్ష నిర్వహిస్తారు

వెబ్‌సైట్‌: Bank.sbi/web/careers, Sbi.co.im/web/careers

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles