Former Samajwadi Party leader Amar Singh passes away రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూత

Former samajwadi party leader amar singh passes away

Amar Singh, Samajwadi Party, india, india news, Amar Singh dead, india news, Samajwadi Party, Rajya Sabha MP Amar Singh passes away, Rajya Sabha MP Amar Singh Dead, Mulayam singh, Akhilesh Yadav, former samajwadi party general secretary, Uttar pradesh, Crime

Rajya Sabha MP and former Samajwadi Party leader Amar Singh, 64, passed away on Saturday. He was undergoing treatment at a hospital in Singapore for several months. Several leaders paid tributes to Singh.

రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూత

Posted: 08/02/2020 12:35 AM IST
Former samajwadi party leader amar singh passes away

దేశ రాజకీయాల్లో తనదైన ఉనికిని చాటుకున్న నేత అమర్ సింగ్ ఇక లేరు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు రాజ్యమేలుతున్న సమయంలో అమర్ సింగ్ తనదైన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కోనసాగుతున్న ఆయన అనారోగ్యం బారిన పడి చికిత్స పోందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు, సమాజ్ వాదీ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శిగా.. ఆ పార్టీని నడపించడంతో పాటు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలోనూ ఆయన అత్యంత కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఎస్పీ అధినేతగా ములాయాం సింగ్ యాదవ్ కొనసాగిన కాలంలో అమర్ సింగ్ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు.

గత కొంతకాలంగా సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు అక్కడి వైద్యులు దృవీకరించారు. మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న అమర్‌సింగ్‌..  గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో శనివారం ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన కుటుంబం కూడా ఐసీయూ పక్కనే ఓ గది తీసుకొని ఉంటున్నట్టు సమాచారం. అమర్‌ సింగ్‌ వయస్సు 64 ఏళ్లు. ఆయన మరణించేందుకు కొంత సమయం ముందు  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ట్వీట్‌ పెట్టారు.

2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అణు ఒప్పందం విషయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంలో సమాజ్ వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో అమర్ సింగ్‌ కీలకంగా వ్యవహరించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2010లో అమర్ సింగ్‌, సినీనటి జయప్రదను సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అమర్ సింగ్‌ 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2003, తాజాగా 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles