(Image source from: tv.mathrubhumi.com)
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా లక్ష కరోనా కేసులు దాటింది, ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు లక్షన్నర మార్కును అధిగమించాయి. ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు ఐదు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. ఇవాళ తొమ్మది వేల మార్కును అధిగమించాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా లక్ష యాభై వేల మార్కును అధిగమించింది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల రోజరోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తొమ్మిది వేల పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తమైంది.
తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా లక్షా యాభై వేల మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 10376 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 1,50,209 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ, అనంతపూర్, కర్నూలు, గుంటూరు ల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా ఏకంగా పన్నెండు వందల సంఖ్యలో ఒక్క కర్నూలులోనే నమోదు కావడం.. దీంతో పాటు మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం అక్కడి తీవ్రతను తెలియజేస్తోంది.
ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 1128, చిత్తూరు జిల్లాలో 949, తూర్పు గోదావరి జిల్లాలో 876, గుంటూరు జిల్లాలో 1001, కడప జిల్లాలో 547, కృష్ణా జిల్లాలో 357, కర్నూలు 1234. నెల్లూరు జిల్లాలో 559, ప్రకాశం జిల్లాలో 402 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 455, విశాఖపట్నం జిల్లాల్లో 1155, విజయనగరంలో 119, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 494 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, దీంతో జిల్లా వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు.
కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 58 మంది అసువులు బాసారు. గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరిలో 8మంది, విశాఖపట్నంలో 8, గుంటూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు కరోనాతో మృతి చెందారు.మొత్తంగా 1,407 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు 1,407 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,614 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 72,188 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more