Kangana Ranaut hears gunshots near her Manali residence హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

Kangana ranaut alleges gunshots fired near her residence in manali

Kangana Ranaut, Sushant Singh Rajput, Sushant Singh Rajput case, sushant singh rajput death, Sushant Singh Rajput, sushant singh rajput death case, sushant singh rajput death investigation, Manali, Kangana Ranaut gunshots, Kangana Sushant,investigation, Manali, gunshots, mumbai, maharashtra, crime

Actress Kangana Ranaut who is currently quaranting in Manali, alleged that she heard gunshots near her residence on Friday night. She feels that it is a threat because of her bold claims in Sushant Singh Rajput's death case. The Kullu district police immediately reached her house after the incident and deployed security at her house.

హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..!

Posted: 08/02/2020 01:06 AM IST
Kangana ranaut alleges gunshots fired near her residence in manali

బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ గా ఇటీవలే ముద్రపడిన కంగనా రనౌత్ ఇంటివద్ద తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన జరగ్గా అమె పోలసీులకు పిర్యాదు చేసిన తరువాత దానిని గోప్యంగా వుంచేందుకు పోలీసులు ప్రయత్నించినా విషయం వెలుగులోకి వచ్చింది. మనాలీలోని కంగనా నివాసం సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ తీరుతెన్నులపై విమర్శలు గుప్పిస్తున్నకంగనా ముఖ్యమంత్రి కుమారుడిని ‘‘బేబీ పెంగ్విన్‌’’అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

ఈ క్రమంలో కాల్పుల పరిణామం చోటు చేసుకోవడం ఆమె అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ఈ ఘటనపై నటి కంగనా రనౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పెద్ద శబ్దం వినిపించిందని, వెంటానే తాను తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జిని పిలిచినట్లు తెలిపారు. అయితే, ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానించారని కానీ పొరుగువారిని అడిగినప్పుడు, వారు దీన్ని ఖండించారని వెల్లడించారు. ఎనిమిది సెకన్ల వ్యవధిలో రెండు షాట్లను విన్నాననీ, తుపాకీ కాల్పులు ఎలా ఉంటాయో తనకు తెలుసంటూ ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

స్థానికుల ద్వారా తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, కేవలం ఏడు, ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఇలాంటి చేయించడం ముంబైలో పెద్ద కష్టమేమీ కాదని కంగనా వ్యాఖ్యానించారు. అంతేకాదు బహుశా సుశాంత్ ను కూడా ఇలాగే భయపెట్టి ఉంటారని పేర్కొన్నారు. అయినా తాను భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొడుకు గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కంగనా అభిప్రాయపడ్డారు.  తన ఫిర్యాదు మేరకు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని కంగనా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  Sushant Singh Rajput  investigation  Manali  gunshots  mumbai  maharashtra  crime  

Other Articles