PM Modi launches Transparent Taxation platform 'పారదర్శక పన్ను విధాన వేదిక'ను అవిష్కరించిన ప్రధాని

Pm modi launches transparent taxation portal a new faceless tax system

foreign,monetary policy,indian trade,Transparent Taxation portal,PM Modi,faceless appeal,Prime Minister of India,faceless assessment,Direct Tax,Trust law,artificial intelligence

Prime Minister Narendra Modi launched faceless assessment, faceless appeal and taxpayers' charter, as key features of Transparent Taxation on Thursday, as the government took to honouring honest taxpayers of the country.

ప్రత్యేక్ష పన్నుల చెల్లింపుల కోసం ‘‘పారదర్శక విధాన వేదిక’’

Posted: 08/14/2020 01:03 AM IST
Pm modi launches transparent taxation portal a new faceless tax system

దేశంలో నీతిగా, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నవారు ఎందరో. దేశ ప్రగతిలో తాము భాగం అని తమ గురుతర బాధ్యతను ఎరిగి ప్రతీ ఏడాది పన్నును మినహాయించుకున్న తరువాతే తమ డబ్బును తీసుకునే వారు ఉద్యోగులన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దేశంలో ఆదాయపన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పన్ను చెల్లింపుదారుల నిజాయితీకి మరింత సాధికారికతను లభించేలా కేంద్ర పారదర్శక పన్ను విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది, దీనిని ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ మీడియా సమావేశంలో అవిష్కరించారు.

నిజాయతీగా పన్నులు చెల్లించేవారే జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారికి లబ్ధి చేకూర్చడం కోసం పారదర్శక పన్నుల విధాన వేదిక తీసుకువచ్చామని ప్రధాన నరేంద్ర మోదీ వెల్లడించారు. స్క్రూటినీలు, అప్పీళ్లకోసం పన్ను చెల్లింపుదారుడు నేరుగా అధికారుల ఎదుట హాజరవనవసరంలేని, 'ముఖ రహిత' సరళతర పన్నుల వ్యవస్థ ట్యాక్స్ చెల్లింపుదారుడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, నైతిక బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. దేశంలో పన్నుల సంస్కరణ పరంగా ఈ పారదర్శక పన్నుల విధాన వేదిక ఎంతో ముఖ్యమైన పరిణామం అని పేర్కొన్నారు.

ఈ సరికొత్త విధానం దేశ పౌరులందరికీ సెప్టెంబరు 25 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఈ విధానం ద్వారా పన్నుల వ్యవస్థ సరికొత్త పంథాను అందిపుచ్చుకుంటుందని, ఎంతో సులభతరం అవుతుందని మోదీ వివరించారు. "నిజాయతీపరులను గౌరవించడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమస్యలు ఉత్పన్నం కాని రీతిలో లావాదేవీలు మా పారదర్శక పన్నుల విధాన వేదిక లక్ష్యం. ఈ ముఖ రహిత విధానంలో... పన్నులు చెల్లిస్తున్నది ఎవరు, పన్నుల అధికారి ఎవరన్నది ముఖ్యం కాబోదు" అని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles