రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని.. అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎందరె ఎన్ని పన్నాగాలు పన్నినా చివరకు తమకు ప్రజామోదం కలిగివుంటుందని మరోమారు అసెంబ్లీలో తనంతట తాను ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలోనూ విజయం సాధించింది. విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాన్ని అందించకుండా ఎత్తుకు పెఎత్తు వేసి మరీ.. బీజేపి ఆశలపై నీళ్లు చల్లింది. ఇక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో నల్లేరుపై నడకలా విజయాన్ని అందుకుంది, ఈ బల పరీక్ష ముగిసిన అనంతరం రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.
అంతకుముందు రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తొలుత సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బు, అధికారం ఉపయోగించి మధ్యప్రదేశ్, మణిపూర్ ,గోవాలో ప్రభుత్వాలను పడగొట్టిందన్న మంత్రి.. అదే మంత్రాన్ని రాజస్థాన్లో ప్రయోగించగా బెడిసికొట్టిందని విమర్శలు గుప్పించారు. గహ్లోత్ నేతృత్వంలోని సర్కార్ను కూలదోసేందుకు కేంద్రం ప్రయత్నించి విఫలమైందని విమర్శించారు. అనంతరం మూజువాణి ఓటింగ్ ద్వారా విశ్వాస పరీక్షకు వెళ్లిన గెహ్లోట్ ప్రభుత్వం విజయాన్ని అందుకుంది.
అనంతరం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మాట్లాడుతూ.. తమ విజయం కొందరికి చెంపపెట్టులాంటిదని అన్నారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రలోభాలతో వారిని తమ వైపుకు తిప్పుకుని ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను పడగొట్టే పార్టీలకు ఈ విజయం గోప్ప సందేశాన్ని ఇస్తుందని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపి ప్రయత్నించిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకుంటామన్నారు. ఈ విజయం రాజస్థాన్ ప్రజా విజయంగా ఆయన అభివర్ణించారు, అనంతరం సచిన్ పైలట్ మాట్లాడుతూ ఎవరెన్ని ఎత్తులు వేసినా చివరకు గెలిచింది మాత్రం తమ ప్రభుత్వమేనని అన్నారు.
ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నాలు చాలించి.. రాష్ట్ర ప్రగతికి దోహదపడితే మంచిచిదని సూచించారు, రాజస్థాన్ లో తమ ప్రభుత్వం విజయం సాధించడం, విశ్వాస పరీక్షలో నెగ్గడం సంతోషంగా వుందన్నారు, రాజస్థాన్ ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని కలసి పనిచేస్తామన్ని పైలట్ అన్నారు, ఇటీవల, సీఎం అశోక్ గెహ్లాట్ కు, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు మధ్య విభేదాలు ముదిరి పాకాన పడి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగి సచిన్ పైలట్ ను తిరిగి అశోక్ గెహ్లాట్ చెంతకు చేర్చగలిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more