SPB critical, on life support over COVID-19 ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం విషమం..

Singer sp balasubrahmanyam critical on life support over covid 19

SP balasubramaniam hindi songs list, SP balasubramaniam, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, Who is sp Balasubrahmanyam, SPB Breathless, spb ilaiyaraaja, spb ilayaraja controversy, Balu, Singer Balu, Who is SPB

Popular playback singer SP Balasubrahmanyam, who was diagnosed with COVID-19, has suffered a setback in his health. According to a statement from MGM Healthcare where he is undergoing treatment for over a week, he is currently on life support and his condition is critical.

కరోనా విజృంభన: ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం విషమం..

Posted: 08/15/2020 12:27 AM IST
Singer sp balasubrahmanyam critical on life support over covid 19

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయనకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఐసీయూలో వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తనకు కరోనా సోకిందని బాలు కొన్నిరోజుల కిందట స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. కాగా, గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు గుర్తించడంతో ఆయనను ఐసీయూలోకి తరలించిన చికిత్స ప్రారంభించారు.

బాలసుబ్రహ్మణ్యానికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు వైద్యులు, ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ లో తెలిపాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, అనిరుధ్‌ రవిచందర్‌, దేవిశ్రీ ప్రసాద్‌, భారతీరాజా, నటుడు ధనుష్‌, సౌందర్య రజనీకాంత్‌, చిన్మయి శ్రీపాద, ఖుష్బూ, రాధికా శరత్‌కుమార్‌, బోనీ కపూర్‌, దర్శకుడు రాధాకృష్ణ, విక్రమ్‌ ప్రభు, నటుడు ప్రసన్న, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, హర్ష భోగ్లే, క్రికెటర్‌ అశ్విన్‌ తదితరులు ఎస్పీబీ కోసం ప్రార్థించిన వారిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles