(Image source from: Thehansindia.com)
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత విద్యా సంవత్సరం ఆఖరులో అనగా మార్చి నెలలో మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయితే రానున్న విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోయే పరిస్థితుల్లో.. కనీసం డిజిటల్ క్లాసులకైనా అనుమతులు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాుల కోరడంతో కేంద్రం విద్యాశాఖ అనుమతులు జారీ చేసింది. అయితే అందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేయడంతో ఇప్పటికే అన్ని ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించాయి, అంతేకాదు ఫీజల కోసం కూడా విద్యార్థులను బతిమాలుతున్నాయి. మీ పేరెంట్స్ ను వెంటనే ఫీజులు చెల్లించమని చెప్పండీ అంటూ ప్రాధేయపడుతున్నాయి.
సహజధోరణికి భిన్నంగా ఇలా చేస్తున్నా.. మరికోన్ని పాఠశాల యాజామాన్యాలు మాత్రం తమ ఒరవడి మారదు అంటూ పీజుల కోసం వారి తల్లిదండ్రుల వెంటబడుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల తరగతల కోసం యోచించిన తెలంగాణ ప్రభుత్వం వారికి డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత ఈ తరగతులను ఈ నెల 17న ప్రారంభించాలని నిర్ణయించినప్పుటికీ అందుకు అధికార యంత్రాంగం సమాయత్తం కాకపోవడంతో వాయిదా వేసింది. ఆ తరువాత ఈ నెల 24న ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ అవి కూడా వాయిదా పడ్డాయి.
ప్రభుత్వ కాలేజీలు, పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు దూరదర్శన్ లోని అధికార తెలంగాణ ఛానెల్ యాదగిరితో పాటు టీ-శాట్ లోని ఛానళ్లలో ప్రసారం చేయాలని నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో ఇవి ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా పడ్డాయి. అందుకు వర్షాలు, అధికారుల సమాయత్తం అన్న అంశాలు తెరపైకి వచ్చినా.. డిజిటల్ తరగతుల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే మోకాలడ్డిందని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. పాఠాలు ప్రసారం కాలేదు. అయితే తరగతుల ప్రసారానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా పచ్చజెండా ఊపలేదని, అందువల్లే కొంత ఆలస్యం జరుగుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి,
ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు తెరవడంపై కేంద్రం నిషేధం ఉండటం, హైకోర్టులో కేసు ఈ నెల 27న మళ్లీ విచారణకు రానుండటం తదితర కారణాలతో ప్రభుత్వం డిజిటల్ పాఠాలకు పచ్చజెండా ఊపలేదని చెబుతున్నారు. ఇక తాజాగా కేంద్రం నుంచి అనుమతులు లభించిన కారణంగా వచ్చే నెల 1 నుంచి డిజిటల్ తరగతులు ప్రసారం కానున్నాయని సమాచారం. పాఠశాలలను తిరిగి తెరవడం, సాధారణ తరగతుల ప్రారంభంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సూచనలు జారీ చేస్తామన్నారు. అప్పటివరకు పాఠశాల విద్యాశాఖలోని ఎస్‌సీఈఆర్‌టీ తయారు చేసిన ప్రత్యామ్నాయ క్యాలెండర్ ను అనుసరించాలని సూచించారు.
వివరణాత్మక కార్యాచరణ మార్గదర్శకాలను విద్యాశాఖ డైరెక్టర్ జారీ చేయనున్నారు. ఈ నెల 27నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ పాఠశాలల విధుల్లోకి వెళ్లాలని, డిజిటల్ పాఠాల తయారీ(ఈ-కంటెంట్), పాఠాల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. తాజా ఉత్తర్వుల్లో మాత్రం ఉపాధ్యాయులు అందరూ ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లాలని ఆదేశించారు. కాగా విద్యా వాలెంటీర్లు, పార్ట్ టైమ్ ఇన్ స్ట్రక్టర్లకు మాత్రం ఇప్పటికీ విధులకు హాజరుకావాలన్న అదేశాలు జారీ కాలేదు, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న 12600 మంది విద్యావాలెంటీర్లు, 2,800 మంది పీటీఐలు తమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడు అదేశాలు అందుతాయా.? అని ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more