Congress at Historic Low: Azad Double Down on 'Dissent' కాంగ్రెస్ లో కుంపటి రాజేస్తున్న గులాంనబీ అజాద్ వ్యాఖ్యలు..

Congress will sit in opposition for 50 years if internal elections are not held ghulam nabi azad

congress, CWC, Ghulam Nabi Azad, Rajya Sabha, Sonia Gandhi, Internal Elections, Rahul Gandhi, Priyanka Gandhi, National Politics

Senior Congress leader Ghulam Nabi Azad has again raised his voice for internal party organizational elections. He has said that if Congress party wants to sit in the opposition for the next 50 years then there is no need for party elections.

కాంగ్రెస్ లో కుంపటి రాజేస్తున్న గులాంనబీ అజాద్ వ్యాఖ్యలు..

Posted: 08/28/2020 01:28 PM IST
Congress will sit in opposition for 50 years if internal elections are not held ghulam nabi azad

(Image source from: Twitter.com/ANI)

కాంగ్రెస్ అధినాయకత్వంలో మార్పులు తీసుకురావాలంటూ.. అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖ సీడబ్యూసీ సమావేశం.. అందులో యువనేత రాహుల్ గాంధీ చేసిన అరోపణలు అంతా ఆ వెంటనే సద్దుమణుగాయని అనుకున్నా.. అవి ఇంకా పార్టీలో కుంపటిని రాజేస్తునే వున్నాయి. దేశ స్వాతంత్ర సమరానికి ముందు నుంచి దేశప్రజల మన్నన్నలు పోందిన పార్టీగా అవరించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఎన్నడూ ఎదుర్కోని దుర్భర స్థితిని ఎదురురీదుతుందని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి పార్టీ బయటపడాలంటే కాంగ్రెస్ అధినాయకత్వం విషయంలో పార్టీలో ఏర్పడిన తీవ్ర గందరగోళాన్ని పరిష్కరించాలని అన్నారు.

అయితే పార్టీ అధ్యక్షుడిగా ఎవరో ఒకరిని నియమించడం కంటే ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అలా ఎన్నికైన వ్యక్తులను తొలగించడం సాధ్యం కాదన్నారు. నేరుగా నియమించే వ్యక్తికి ఒక్కశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రాబోయే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాలనుకుంటే పార్టీ ఎన్నికలు అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటూ పార్టీ మళ్లీ పూర్వవైభవానికి చేరుకునే అవకాశం వుంటుందని అభిప్రాయపడ్డారు, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా వున్న అజాద్ ఈ వ్యాఖ్యలను చేయడం పార్టీలో అగ్గిరాజేస్తుంది.

ఆజాద్ తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో పంచుకున్న 27 నిమిషాల వీడియోలో, 10-15 సంవత్సరాల క్రితం నుంచే పార్టీ నేతల ఎంపికకు ఎన్నికల ఒరవడి జరిగాల్సి ఉండాలని ఆజాద్ చెప్పాడు. అయితే ప్రస్తుతం సిడబ్యూసీలో నామినేషన్ల ప్రకియ ద్వారా పదవులు లభిస్తున్నాయని, వీరిని కూడా ఎన్నికల ద్వారానే ఎంపిక చేసుకునే విధానం రావాలని అన్నారు. ఎన్నికలలో ఓడిపోతామనే భయం వున్న నేతలు మాత్రమే తన ప్రతిపాదనను తోసిపుచ్చుతారని ఆజాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఇక నామినేషన్ల ద్వారానే పార్టీ పదవులను పోందగలం అని భావించే నేతలు ఇకపై కూడా అదే విధానం కొనసాగాలని కోరుకుంటారని అన్నారు.

'గత చాలా దశాబ్దాలుగా, పార్టీలో మాకు ఎన్నికైన సంస్థలు లేవు. ఇప్పుడు మేము వరుస ఎన్నికలలో ఓడిపోతున్నాము, తిరిగి అధికారంలోకి రావాలంటే మన పార్టీని బలోపేతం చేయాలి. అందుకు ఎన్నికలు నిర్వహించడం ఒక మార్గం.’ అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ సూచించారు. ఈ విధానాన్ని ఎవరైనా వ్యతిరేకించారంటే దానర్థం వారు ఓటమికి భయపడుతున్నారనే అర్థమన్నారు. కాగా, సోనియాకు లేఖ రాసిన 23 నేతల్లో ఆజాద్ కూడా ఒకరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles