(Image source from: Twitter.com/pbhushan1)
ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక్క రూపాయిని జరిమానాగా విధించిన నేపథ్యంలో్ ఆయన దానిని చెల్లించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించిన ఆనంతరం ఆయన ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలిపారు. భారత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులపై ఎంతో గౌరవం ఉందని వ్యాఖ్యానించిన ఆయన, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ప్రకారం, తాను ఒక్క రూపాయిని కోర్టుకు జమ చేస్తానని అన్నారు. ఇదే సమయంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై తాను రివ్యూ పిటిషన్ ను కూడా దాఖలు చేస్తానని ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేశారు.
తాను రివ్యూ పిటిషన్ ను దాఖలు చేసే హక్కును కలిగివున్నానని అన్న ప్రశాంత్ భూషణ్.. దానిని కూడా దాఖలు చేస్తానన్నారు. అయితే, అంతకన్నా ముందే కోర్టు ఆదేశించినట్టుగా జరిమానా కడతానని అన్నారు. ఈ మేరకు ఆయన తన అధికార సామాజిక మాద్యమ అకౌంట్లో ట్విట్ చేశారు. కాగా, గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు సరిగా లేవంటూ భూషణ్ చేసిన వివాదాస్పద ట్వీట్లపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం తొలుత ఆయన తన మనసు మార్చుకునేందుకు అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, అందుకో హద్దు ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, తన అభిప్రాయాలను మార్చుకునేది లేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని కోర్టు ముందు ప్రశాంత్ భూషణ్ స్పష్టం చేయడంతో, కోర్టు ధిక్కరణ నేరంగా దీన్ని పరిగణనలోకి తీసుకుని, ఒక రూపాయి జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రాక్టీస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై సుప్రీంకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేసి, ఆయనను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో శిక్ష విధింపుపై కూడా వాదనలు విన్న సుప్రీంకోర్టు ఆయనకు ఈ రోజు ఒక్క రూపాయిని జరిమానాగా కట్టాలని శిక్షను విధించింది.
My lawyer & senior colleague Rajiv Dhavan contributed 1 Re immediately after the contempt judgement today which I gratefully accepted pic.twitter.com/vVXmzPe4ss
— Prashant Bhushan (@pbhushan1) August 31, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more