Maoist killed in exchange of fire with police in Bhadradri భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

Maoist killed in exchange of fire with police in bhadradri

Devellagudem forest, Gundala, Bhadradri Kothagudem District, Maoists, Encounter, Fire Exchange, combing, DGP Mahender Reddy, Telangana, Crime

One Maoist has been killed in an exchange of fire between Maoists and police here at Devellagudem forest area of Gundala mandal in Bhadradri-Kothagudem district.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

Posted: 09/03/2020 04:39 PM IST
Maoist killed in exchange of fire with police in bhadradri

(Image source from: Thehansindia.com)

తెలంగాణలో మరోమారు మావోల అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టు దళాలు ఎదరుపడటంతో ఇరు వర్గాలకు మధ్య ఎదరుకాల్పులు చెలరేగాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టుల సంచారం గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను చూసిన మావోలు కాల్పులు ప్రారంభించగా, అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. కాగా ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

గత జూలైలో భద్రాద్రి-కొఠాగుడెం లోని మల్లెపల్లిటోగు అడవిలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ను గాయపర్చిన మావోయిస్టులు తప్పించుకున్నారు. దీంతో వారిని పట్టుకునేందుకు అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడవుల్లో విసృత్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు, డీజీపీ మహేందర్‌రెడ్డి నిన్న మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. జులై 17న ఆసిఫాబాద్ వచ్చిన డీజీపీ నెలన్నర వ్యవధిలోనే మరోమారు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, తొలుత ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ పాలనాధికారి సందీప్ కుమార్ ఝా, ఇంచార్జ్ ఎస్పీ సత్యనారాయణతో సమావేశమయ్యారు. అనంతరం ఆదిలాబాద్ ఎస్పీ విష్ణువారియర్ తో కలిసి హెలికాప్టర్ లో ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఏరియల్ సర్వే నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles