Kannada actress Sanjjanaa Galrani arrested శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం: నటి సంజన గల్రానీ అరెస్టు

Drug case kannada film actress sanjjanaa galrani arrested

Sanjana Galrani, Kannada actress, sandalwood industry drugs scandal, Ragini Dwivedi, Rahul Shetty, Bengaluru drug probe, Kannada actor, Sanjana Galrani, Bengaluru, Rahul Shetty, Ragini Dwivedi, Sandalwood, Sandalwood drug probe

Another important arrest has been made in the Sandalwood drugs scandal. The Central Crime Branch (CCB) wing of the Bengaluru police raided the residence of famous Kannada actress Sanjana Galrani on Tuesday morning and has been detained.

శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం: నటి సంజన గల్రానీ అరెస్టు

Posted: 09/09/2020 01:00 AM IST
Drug case kannada film actress sanjjanaa galrani arrested

(Image source from: Timesofindia.indiatimes.com)

కన్నడ చిత్రపరిశ్రమలోనూ డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ తారలను షేక్ అడించిన ఈ వ్యవహారం తాజాగా శాండిల్ వుడ్ లోనూ ప్రకంపనలు రాజేస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర నేర నియంత్రణ విభాగం (సీసీబీ) ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. ఇక తాజాగా ఇవాళ నటి సంజనా గల్రానీని అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని ఇందిరానగర్ లో ఆమె నివాసానికి వచ్చిన పోలీసులు దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు చేసి అమెను అదుపులోకి తీసుకున్నారు.

న్యాయస్థానం నుంచి సర్చ్ వారెంట్ పోందిన అధికారులు అమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక తనిఖీల్లో భాగంగా ఆమె ఇంట్లోని పూల కుండీలు, వంటగది, ఆమె గది, బాల్కనీ, కార్లలోనూ తనిఖీలు చేపట్టారు. అమెతో పాటు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వీరెన్‌ ఖన్నా అనే వ్యాపారవేత్త ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. సంజనా సన్నిహితుడైన రాహుల్‌ థోన్సే ఇచ్చిన సమాచారం ఆధారంగానే సంజన నివాసంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో రాహుల్ థోన్సే ఇదివరకే అరెస్టైన విషయం తెలిసిందే. సంజన ఇంట్లో ల్యాప్ టాప్‌, హర్డ్‌ డిస్క్‌, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles