దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతీరోజు ఎనమిది వందల చేరువలో మరణాలు సంభవిస్తడంగా.. గత పక్షం రోజులుగా దేశంలో ఏకంగా వెయ్యికి మించిన మరణాలు నమోదవుతున్నాయి, కాగా ఇవాళ మరోమారు మరణాలు అదే స్థాయిలో నమోదు కావడం దేశ ప్రజల్లో అందోళన తీవ్రమైంది. తాజాగా మరణాలతో సంఖ్య ఎనబై వేలమార్కును అధిగమించింది. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన మూడవ దేశంగా అవతరించింది. గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. దేశంలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి దేశంలో యాభై లక్షల మార్కుకు చేరువలో వున్నాయి. మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 1050 మందికి పైగా కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యలో మరణాలు సంభవించడంతో దేశస్థులలో అందోళన పెల్లుబిక్కుతోంది.
దీంతో దేశంలో మరణాల సంఖ్య 80 వేల మార్కును అధిగమించింది, ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 25 వేల మంది మృత్యువాత పడినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఏ రోజుకారోజు కొత్త కేసుల నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 84 వేలకు చేరువలో కేసులు నమోదు చేసుకోవడం అందోళన కలిగిస్తోంది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన ఉద్దృతిని పెంచుతూ సమూహవ్యాప్తిలోకి చేరిందన్న సమాచారంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా 79 వేల మార్కుకు పైబడిన కేసులు నమోదవుతున్నాయి, ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య 93 వేల 808 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.
దేశంలో క్రమంగా జడలువిప్పుతున్న కరోనా మహమ్మారి ఏకంగా యాభై లక్షల మార్కుకు చేరువలో వున్నాయి. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో అమెరికా తరువాత రెండవ స్థానంలో భారత్.. నిలువడం.. దేశంలో కరోనా ప్రభావాన్ని తెలియజేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 3.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. ఇక అన్ లాక్ 4.0 కూడా అమల్లోకి రావడం,, బార్లు సహా పలు స్వల్ప సంఖ్యలోని జనసమూహాలకు అనుమతులు కూడా లభ్యం కావడంతో.. కేంద్రం కూడా పలు ఆంక్షలను తొలగించి మరికోన్ని సడలింపులు కూడా అమల్లోకి రావడంతో మరిన్ని కేసులు పెరుగుతాయా.? అన్న అందోళన కూడా రేకెత్తుతోంది. ఆరు మాసాలు పైగా గడుస్తున్నా ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికీ వాక్సీన్ రాకపోవడం కూడా దేశ ప్రజల్లో అందోళనకు కారణమవుతోంది.
గత జూలై మాసంలో 19 లక్షల కేసులు ఇక ఆగస్టు మాసంలో మరో 20 లక్షల కేసులతో ఏకంగా రెండు నెలల వ్వవధిలోనే నలభై రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రతీ రోజు ఎనమిది వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 1054 మార్కును అందుకున్నాయి, ఇక తాజాగా మరణాల్లోనూ భారత్ ఏకంగా ప్రపంచంలో మూడవ స్థానంలో నమోదు కావడం గమనార్హం. ఇక మరణాలలో నాల్గవ స్థానంలో వున్న బ్రిటెన్ ను కూడా భారత్ అధిగమించి మూడవ స్థానంలో కోనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి, దేశంలో సెప్టెంబర్ 1 అన్ లాక్ 4.0 నుంచి అమల్లోకి రావడంతో అమల్లో ఉన్న అంక్షల్లో కొన్ని కనుమరుగు కానున్నాయి.
దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 4.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 83,808 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 49.30 లక్షల కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోనే నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 1054 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 80 వేల మార్కును అందుకున్నాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్యతో ఏకంగా 80,776కు చేరింది.
దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో అందులోనూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరణాల సంఖ్య అధికంగా నమోదైంది, గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో 75 వేల మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 37 లక్షల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 9.90 లక్షల యాక్టివ్ కేసులు వున్నాయని వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 78 శాతంగా నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more