Lok Sabha MP Balli Durga Prasad Rao passes away ఎంపీ దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Tirupati mp balli durga prasad succumbs to cardiac arrest after getting covid 19

Balli Durga Prasad, Corona Virus, MP Demise, Chennai Hospital, President Of India, Ram Nath Kovind, Prime Minister, Narendra Modi, Venkaiah Naidu, YS Jagan, Chandrababu, Uttam kumar Reddy, YSRCP MP, Telugudesam, Tirupati MP, PM Modi, President, Andhra Pradesh, Politics

YSRCP's Member of Parliament (MP) representing Tirupati, Balli Durga Prasad Rao, succumbed to COVID-19 after suffering a cardiac arrest at a private hospital in Chennai. Comorbidities are said to be the main reason for the MP's death. The MP from Andhra Pradesh was 64.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Posted: 09/17/2020 03:27 AM IST
Tirupati mp balli durga prasad succumbs to cardiac arrest after getting covid 19

తిరుపతి ఎంపీ, వైసీపీ నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారి కాటుకు బలయ్యారు. దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. కరోనా పాజిటివ్ అని తెలియడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఆయన ఈ సాయంత్రం కన్నుమూశారు. కరోనాతో అసుపత్రిలో చికిత్స పోందుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో 1985లో దుర్గాప్రసాద్ రాజకీయాల వైపు అడుగులేశారు. అదే పార్టీ అధ్వర్యంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వృత్తిరిత్యా న్యాయవాదిగా కొనసాగుతున్న ఆయన ప్రవృత్తిగారాజకీయాలను ఎంచుకున్నారు.

28 ఏళ్ల ప్రాయంలో అసెంబ్లీ గడపతొక్కిన ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ప్రస్తుతం తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి ఆయన లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికైన ఆయన గూడూరు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఆయన 1985, 1994, 1999, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1996 నుంచి 98 వరకు మంత్రిగా వ్యవహరించారు. నాయుడుపేట మండలం భీమవరం గ్రామం బల్లి దుర్గాప్రసాద్ స్వస్థలం. ఆయన తల్లిదండ్రులు పెంచలయ్య, రామలక్ష్మమ్మ. దుర్గాప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గాప్రసాద్ మరణవార్త మీడియాలో రావడంతో ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ప్రముఖుల సంతాపం

 

బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణవార్తతో కదిలిపోయానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ విషాదం సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

దుర్గాప్రసాద్ ఇక లేరన్న వార్తతో తీవ్ర విచారానికి గురయ్యానని తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన దుర్గాప్రసాద్ అనేక ప్రజా ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారని తెలిపారు. పార్లమెంటేరియన్ గా, గూడూరు శాసనసభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని వెల్లడించారు.

పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతి ఎంతో విషాదం కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసం ప్రభావవంతమైన సేవలు అందించారని కీర్తించారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు, హితులకు సంతాపం తెలుపుకుంటున్నాని ట్వీట్ చేశారు.

బల్లి దుర్గాప్రసాద్ (64) హఠాన్మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి సానుభూతి వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ కుమారుడితో మాట్లాడిన ఆయన తన సంతాపం తెలియజేశారు. ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాలుగు దశాబ్దాల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజాసేవలో అవిరాళ కృషి చేశారని కొనియాడారు. బల్లి దుర్గాప్రసాద్ మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.  

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బల్లి దుర్గాప్రసాద్ ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బల్లి దుర్గాప్రసాద్ గతంలో నాలుగు సార్లు టీడీపీ తరఫున గూడూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఓసారి మంత్రిగానూ వ్యవహరించారు.

ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నానని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ఆయన మృత్యువుకు బలయ్యారని తెలిపారు. ప్రాణాంతక వైరస్ ఆయనను కబళించడం తీవ్ర విచారం కలిగిస్తోందని ట్వీట్ చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల తీవ్ర విచారానికి గురయ్యారు. "లోక్ సభలో నా సహచరుడు, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కారణంగా మృతి చెందారన్న వార్త కలచివేస్తోంది. ఈ విషాద ఘడియల్లో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కఠోరమైన వాస్తవం ఏమిటంటే...  కోరలు చాస్తున్న ఈ మహమ్మారి నుంచి మనలో ఏ ఒక్కరూ కూడా సురక్షితంగా లేరన్న విషయం ఈ ఘటనతో వెల్లడైంది" అంటూ ఉత్తమ్ కుమార్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles