(Image source from: newsable.asianetnews.com)
కరోనా మహమ్మారి బారిన పడిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటెన్ లో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా మహమ్మారి సోకడంతో ఆగస్టు 5న చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 10 వరకు ఆయన పరిస్థితి కొంత విషమంగానే వున్నా ఆ తరువాత ఆయన కోలుకున్నారని, వైద్యుల చికిత్సలో భాగంగా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితులు కూడా వున్నాయని అంతా భావించారు. ఈ క్రమంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్సీ చరణ్ కూడా తన తండ్రి కొలుకుంటున్నారని.. ప్రస్తుతం ఆయన అరోగ్యం చాలా మెరుగైయ్యిందని చెప్పారు.
ఆ తరువాత కోన్ని రోజులకు తన తండ్రి కరోనా నెగిటివ్ నివేదిక వచ్చిందని, దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే చికిత్సలో భాగంగా ఇంకా వెంటిలేటర్ సాయంపైనే వైద్యులు చికిత్సను అందిస్తున్నారని అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు బాలసుబ్రహ్మణ్యం ఆరోగంగా చాలా మెరుగయ్యిందని, ఆయన యోగా చేస్తున్నారని, క్రికెట్ కూడా వీక్షించేందుకు రెడీ వున్నారని కూడా ఎస్పీ చరణ్ తెలిపారు. అయితే తన తండ్రి గురించి బాధ్యతారాహిత్యంగా పలు పత్రికలు తనను సంప్రదించకుండా, అసుపత్రి వర్గాల ఎలాంటి వివరాలను తెలపకున్నా ఆయన అరోగ్య పరిస్థితిపై తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Health bulletin on Thiru S P Balasubrahmanyam, as on September 24 2020, 6:30 PM IST#MGMHealthcare #SPBalasubrahmanyam pic.twitter.com/fLAAtH074h
— MGMHealthcare (@MGMHealthcare) September 24, 2020
అయితే ఇలా అరోగ్యంగా, యాక్టివ్ గా వున్న ఎస్పీ బాలు అరోగ్యం అకస్మాత్తుగా గడిచిన 24 గంటల నుంచి తీవ్ర విషమంగా ఉందని తెలియడం అభిమానులను అందోళనకు గురిచేస్తోంది, కాగా అసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటెన్ లో ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతోందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా క్షీణించిందని, ఆయనకు అత్యున్నత స్థాయిలో లైఫ్ సపోర్ట్ సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
ఎంజీఎం ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తోందని ఎంజీఎం ఆసుపత్రి వైద్య సేవల ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ పేరిట విడుదలైన ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. బాలు ఆరోగ్యం మెరుగయ్యిందని అయినా ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్సను అందిస్తూ పూర్తిగా కోలుకునేందుకు చికిత్సను అందిస్తు్నామని ఇటీవల ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నాయి. బాలు పరిస్థితి క్షీణించిందన్న సమాచారంతో నటుడు కమలహాసన్ హుటాహుటీన ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. బాలు ప్రస్తుత పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. బాలు తనయుడు ఎస్పీ చరణ్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more