SP Balasubrahmanyam dies at 74 in Chennai మూగబోయిన గానగంధర్వుడి గాత్రం.. ఎస్పీ బాలు ఇకలేరు..

Legendary singer s p balasubrahmanyam passes away due to covid 19

SPB dead, Balasubrahmanyam death Balasubrahmanyam death news SP Balasubrahmanyam dies SP Balasubrahmanyam dead singer Balasubrahmanyam, SP balasubrahmanyam hindi songs list, SP balasubrahmanyam, SP Sailaja, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, MGM Hosiptal, coronavirus, covid-19, sp Balasubrahmanyam, SPB Breathless, spb ilaiyaraaja, spb ilayaraja controversy, Balu, Singer Balu, Who is SPB

SP Balasubrahmanyam death news: Legendary singer SP Balasubrahmanyam, aged 74, breathed his last today. He was in hospital for nearly two months after being diagnosed with Covid-19 in August. He tested negative on September 13.

మూగబోయిన గానగంధర్వుడి గాత్రం.. ఎస్పీ బాలు ఇకలేరు..

Posted: 09/25/2020 02:59 PM IST
Legendary singer s p balasubrahmanyam passes away due to covid 19

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అమృతగాత్రం మూగబోయింది. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గత రాత్రి నుంచి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా వుందని.. చికిత్సకు కూడా ఆయన సహకరించడం లేదని అసుపత్రి వర్గాలు అందోళన వ్యక్తం చేసిన సమయంలోనే ఆయన దివికెగిసారు. కరోనా మహమ్మారి సోకడంతో ఆగస్టు 5న చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 10 వరకు ఆయన పరిస్థితి కొంత విషమంగానే వున్నా ఆ తరువాత ఆయన కోలుకున్నారని, వైద్యుల చికిత్సలో భాగంగా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితులు కూడా వున్నాయని అంతా భావించారు.

ఈ క్రమంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్సీ చరణ్ కూడా తన తండ్రి కొలుకుంటున్నారని.. ప్రస్తుతం ఆయన అరోగ్యం చాలా మెరుగైయ్యిందని చెప్పారు. సెప్టెంబర్ 13న తన తండ్రికి కరోనా నుంచి విముక్తుడయ్యాడని, బాలుకు కరోనా నెగిటివ్ రిపోర్టు కూడా వచ్చిందన్నారు, అయితే గత 52 రోజులుగా పోరాడిన ఆయన ఇవాళ మధ్యహ్నం ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. క్రితం రోజు నుంచి ఆయన అరోగ్యం విషమించిందని తెలిసిన తరుణంలో ఆయన అభిమానులతో పాటు యావత్ భారతీయ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు అందోళన వ్యక్తం చేశారు. ఆయన అభిమాన లోకం శోకసంధ్రంలో మునిగింది.

క్రితం రోజు నుంచే విషమంగా బాలు అరోగ్యం..

అరోగ్యం మెరుగవుతున్న క్రమంలో యాక్టివ్ గా వున్న ఎస్పీ బాలు అరోగ్యం అకస్మాత్తుగా గడిచిన 24 గంటల నుంచి తీవ్ర విషమంగా మారింది, చెన్నైలోని ఎంజీఎం అసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులెటెన్ లో ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్ పై ఎక్మో సాయంతో చికిత్స కొనసాగుతోందన్నారు. అయితే గత 24 గంటల్లో ఆయన పరిస్థితి బాగా క్షీణించిందని, ఆయనకు అత్యున్నత స్థాయిలో లైఫ్ సపోర్ట్ సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేసిన గంటల వ్యవధిలోనే ఆయన అభిమానులను వదిలేసి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles