గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికెగిసినా.. ఆయన గాత్రంతో నిత్యం చిరంజీవిలా సజీవంగానే వుంటారన్నడంలో అతిశయోక్తి లేదు. శ్రీపతి పండితారాధ్యుల బాలుగారి మరణంతో యావత్ దేశంలోని సంగీతారాధ్యులు, సంగీత ప్రియులు, అభిమానులు శోకసంధ్రంలో మునిగారు. 16 బాషల్లో ఏకంగా 40 వేలకు పైగా పాటలను పాడిన ఆయన మరణంతో భారతీయ సినిమారంగమే ఓ గోప్ప సంగీత విధ్వాంసుడిని కోల్పోయింది. ఎస్పీ బాలు మృతిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందిస్తూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో సినీ రంగం ఓ మధుర గాత్రాన్ని కోల్పోయిందని ఆయన ట్వీట్ చేశారు. 'పాడుమ్ నిలా', 'పాటల చందమామ' అంటూ అశేష అభిమాన జనం ఎంతో ప్రేమగా పిలుచుకునే ఎస్పీ బాలు పద్మభూషణ్ సహా అనేక జాతీయ అవార్డులు అందుకున్నారని రాష్ట్రపతి అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నానని ప్రకటన చేశారు.
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోఢీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ బాలు మరణం దురదృష్టకరం అన్న ప్రధాని, మన సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బాలు పేరు ప్రతి ఇంటా వినిపించేదని, దశాబ్దాలుగా ఆయన మధుర కంఠస్వరం, సంగీతం శ్రోతలను అలరించిందని తెలిపారు. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారినపడ్డారని తెలిసినప్పటి నుంచి డాక్టర్లతో రోజూ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నానని వెల్లడించారు. ఎస్పీ చరణ్ తోనూ మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ, వైద్యులకు సూచనలు చేస్తుండేవాడినని తెలిపారు. బాలు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం విచారకరం అని వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ గళాలను వెలుగులోకి తీసుకువచ్చారని కొనియాడారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వివరించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా, తమ అత్యుత్తమ సేవలు అందించినా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కాపాడలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాలు సినీ ప్రపంచంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అత్యుత్తమ రీతిలో సేవలందించారని కొనియాడారు. ఆయన మరణంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.
మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 6 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 'రిప్ ఎస్పీబీ' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.
సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. "ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికే తీరని లోటు" అని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడ్డానని, కోలుకుంటున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు చెప్పారని... ఆయన త్వరగా కోలుకోవాలని తాను కూడా ఆకాంక్షించానని చెప్పారు. ఆయన కోలుకోవాలని యావత్ దేశం కోరుకుందని... కానీ, దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమైపోయారని అన్నారు. బాలుగారిని చిన్నప్పటి నుంచి చూశానని... ఆయనంటే తనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పారు. ఇలాంటి స్థితిలో ఆయన మృతి చెందడం కలచివేస్తోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా తన స్పందనను తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more