వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసు సంచలనంగా మారింది. భర్తతో సంసారజీవితంలో గొడవల కారణంగా విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. ఆ కేసు విషయంలో కోర్టు పేషీకి హాజరైన దీపికను అదే రోజున సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన కేసులో ట్వీస్టు ఏర్పడింది. అయితే ఈ గుర్తుతెలియని అగంతకులు ఎవరా అంటూ దర్యాప్తులో భాగంగా పోలీసులు కూపీ లాగడంతో.. అమె భర్త అఖిల్ కు చెందిన కారులోనే అగంతకులు అమెను కిడ్నాప్ చేశారని తెలుసుకున్నారు. అయితే ఇది ప్లాన్ ప్రకారం ఇద్దరికీ ఇష్టంతోనే జరిగిందా.? లేక భర్త తరపున అతని స్నేహితులు కావాలనే ఇలా చేశారా.? అన్నది పోలీసులు తేల్చాల్సివుంది.
దీపిక తల్లిదండ్రులు అమెను భర్తతో కలసి వుండాలని అఖిల్ పైనే దీపిక పోఈ కేసు కోర్టులో కొనసాగుతుండగానే భర్త అఖిల్ కు చెందిన కారులోనే గుర్తు తెలియని వ్యక్తులు దీపికను అపహరించుకుపోయారు. కారు ఆమె భర్తదే కావడంతో అతనే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి. దీపిక, అఖిల్ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితమే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే శనివారం ఇరువురు వికారాబాద్ కోర్టుకు కూడా హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ యువతిని కారులోకి లాక్కొని పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి వెళ్లిపోయారు.దీంతో దీనిపై దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర మూడు రూట్స్ కు వికారాబాద్ సెంటర్ పాయింట్ కావడంతో హైవే రూట్స్ లో పోలిస్ టీమ్స్ నిన్నటి నుండే జల్లెడ పడుతున్నారు. అయితే దీపికను ఎక్కడికి తీసుకెళ్ళారన్న విషయాన్ని ఇప్పటికీ పోలీసులు కనుగొనలలేదు,. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more