(Image source from: Sakshi.com)
వికారాబాద్ లో వివాహిత దీపిక కిడ్నాప్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో దీపిక అచూకీ కోసం పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో అందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే దీపిక కిడ్నాప్ కు గురై 40 గంటలకు పైగా కావస్తున్నా అమె ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర అందోళన చెందుతున్నారు. తమ కూతురి క్షేమ సమాచారం అయినా తెలియకపోవడంతో దీపిక త్లలి తీవ్రంగా కలత చెందుతోంది. అయితే కిడ్నాపర్లు దీపికను పోరుగునున్న కర్ణాటకలోకి తీసుకువెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలో దీపిక కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా భర్తతో కలిసే వెళ్లివుంటుందన్న సందేహాలను వారు ఖండిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా దీపిక తమతోనే వుంటుందని, సంసార జీవితంలో గొడవల కారణంగా భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తుందని, అలాంటిది ఆమె భర్తే కావాలనుకుంటే తమకు ఎందుకు చెప్పదని వారు ప్రశ్నిస్తున్నారు. దీపిక కావాలనే భర్తతో వెళ్లిపోయిందని.. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని సందేహాలు వ్యక్తం కావడాన్ని కూడా వారు తోసిపుచ్చుతున్నారు. 2016లో దీపికను ప్రేమ వివాహం చేసుకున్న అఖిల్ పెళ్లైన తరువాత కనీసం ఒక్క నెల కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయాడని అందుకనే తమ బిడ్డ తమ వద్దకు వచ్చేసిందని వారు చెప్పారు. నాలుగేళ్లుగా భర్త నుంచి విడాకులు కోరుతూ కేసు పేషీలకు హాజరవుతుందని చెప్పారు.
దీపిక, అఖిల్ 2016లో ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు సంవత్సరాల క్రితమే అమ్మాయి ఇంటికి వచ్చి.. అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే నిజానికి అమెకు అఖిల్ తో వెళ్లి కాపురం చేయాలనుకున్నా.. లేక భర్త కావాలని అనుకున్నా ఇంత కిడ్నాప్ డ్రామా అవసరం లేదని అమ్మాయి పేరెంట్స్ చెబుతున్నారు. కాగా దీపిక గాలింపు కోసం మరో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 7 బృందాలతో గాలిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక లో ఉన్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా దీపిక.. తన భర్త అఖిల్ తో డ్రామాలాడే వెళ్లినా.. క్షేమంగా చేరుకున్న తరువాత అయినా కనీసం తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా అయినా సంప్రదించేది కదా.? వారిని సంప్రదించకపోయినా.. కనీసం బందువులనైనా సంప్రదించేది కదా అన్న అనుమానాలు కూడా పోలీసులలో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటి వరకు ఎందుకు అందుబాటులోకి రాలేదనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అఖిల్ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండటంతో అందరిలో టెన్షన్ పెరుగుతోంది. అఖిల్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిన్నటి వరకు దీపికా, అఖిల్‌లు కోర్టులో కాని లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం వెళ్తారని పోలీసులు భావించారు. కానీ అలాంటిదేమి జరగకపోవడంతో అందరిలో టెన్షన్ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more