Vice Prez Venkaiah Naidu tests positive for COVID-19 ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

Vice president m venkaiah naidu tests positive for coronavirus is asymptomatic

Vice Prez Venkaiah Naidu tests positive for COVID-19, Vice President, M Venkaiah Naidu, venkaiah naidu asymptomatic, Venkaiah Naidu coronavirus, venkaiah naidu covid positive, venkaiah naidu Coronavirus India, home quarantine

Vice President M Venkaiah Naidu has tested positive for coronavirus during a routine test, his office said in a tweet this evening. The 71-year-old, who is in home quarantine, is 'asymptomatic and in good health', the tweet read.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

Posted: 09/30/2020 10:20 AM IST
Vice president m venkaiah naidu tests positive for coronavirus is asymptomatic

(Image source from: National.janamtv.com)

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో ఏకంగా 61 లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడగా.. వారిలో ఎందరో ప్రముఖులు వున్నారు. వీరిలో రాజకీయ ప్రముఖుల సంఖ్య కూడా గణనీయంగానే వుంది. స్వయంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే 61 లక్షల మందిలోనూ రికవరీ రేటు చాలా అధికంగా వుండటం దేశ ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. అయితే కరోనా మహమ్మారి కబళించిన వారి సంఖ్య ఏకంగా 96 వేల మందికి పైగా ఉండటంతో ప్రజల్లో అందోళన కూడా రేపుతోంది. వీరిలో కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి నుంచి పార్లెమెంటు ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కూడా అసువులు బాసారు.

ఆయనతో పాటు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకంగా నలుగురు ఎంపీలు కూడా కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. ఇక తాజాగా మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతి కూడా కరోనా బారిన పడ్డారు. అమెకు జర్వం అధికంగా వుండటంతో అమె ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఇటీవల దేశం మెచ్చిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడి ఏకంగా 50 రోజుల మేర చికిత్స పోందుతూ మరణించారు. ఇక రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక వీరిలోనూ ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య బాగానే వుంది. ఇక తాజాగా కరోనా మహమ్మారి బారిన మరో ప్రముఖ రాజకీయ నేత కూడా పడ్డారు.

ఆయన మరోవరో కాదు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇవాళ ఉపరాష్ట్రపతి కార్యాలయం ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని తేలింది. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో వెంకయ్యనాయుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వెంకయ్య ఈరోజు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషాకు కరోనా నెగటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె కూడా ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారుని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles