(Image source from: Freepressjournal.in)
అదృష్టం అన్నది రాసి ఉంటే.. పర్వతాల కింద వున్నా తగు సమయంలో వచ్చిన క్రమంలో వచ్చి హత్తుకుంటాయని పెద్దలు అంటారు. అంతేకాదు.. నీళ్లలో కొట్టుకుపోతున్నా దూకి అదిమి పట్టుకోవాలని అందుకు తానే ఉదాహరణ అంటూ చాటిందీ ఈ వృద్దనారీమణి. అయితే ఇలా అదృష్టం పట్టాలంటే మాత్రం తప్పకుండా కొంత ధైర్యం చేయాల్సిందే. ఆరవై ఏళ్ల వయస్సులోనూ నదిలోకి దూకి తనంత బరువున్న చేపను అదిమిపట్టుకుని బయటకు తీసుకురావడం వల్లే ఈ వృద్ద మహిళకు అదృష్టం వరించింది. అయితే దానిని మార్కెట్ కు తరలించడంలో స్థానికులు సాయం కూడా అందించారు. దైర్యే సాహసే లక్ష్మీ అన్న నానుడి ఈమె విషయంలోనూ నిజమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సుందర్ బన్స్ ప్రాంతంలోని సాగర్ ఐలాండ్స్ లో నివసించే పుష్పాకర్ అనే ఓ వృద్ద మహిళ తన కుటుంబపోషణ కోసం సమీపంలోని నదిలో చేపలు పట్టేందుకు వెళ్లగా అమెను అదృష్టం పలకరించింది. చేపలు పట్టేందుకు నది సమీపానికి వెళ్లగానే.. ఓ పెద్ద చేప నీటిలో కొట్టుకుంటున్నట్లు అమె గమనించింది. అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అరవై ఏళ్ల వృద్దురాలు ఎంతో ధైర్యంగా నదిలోకి దూకింది. వెంటనే దానిని అదిమిపట్టుకునే ప్రయత్నం చేసింది. అది చిన్న చేప కాదు.. ఏకంగా 52 కిలోల పెద్ద చేప. దీంతో దానిని నది ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అమె చాలానే ప్రయాసకోర్చాల్సి వచ్చింది.
ఇక ఫుష్పాకర్ ఓ పెద్ద చేపను ఒడ్డుకు చేర్చడాన్ని చూసిన తొటి మత్స్యకారులు అమె వద్దకు చేరుకున్నారు. చాలా పెద్దగా వుండటంతో అమెకు కనీసం లక్ష రూపాయల మేర వస్తుందని అందరూ చెప్పారు. కాగా ఓ మత్య్సకారుడు మాత్రం అది సాధారణ చేప కాదని, దాని పేరు భోలా అని అమెతో అన్నాడు. దీని ధర కేజీకి వేలలో వుంటుందని అన్నాడు. అయితే మార్కెట్ కు తరలిస్తేనే అసలు విషయం తెలుస్తుందని భావించిన పుష్పాకర్.. తోటి మత్స్యకారుల సాయంతో తాను పట్టుకున్న భోలా చేపను మార్కెట్ కు తరలించింది. దానిని అక్కడ తూకం వేయగా అది 52 కిలోల బరువు తూగింది. దీంతో కేజీకి రూ.6200 చోప్పున దానికి ధర పలికింది.
అయితే పుష్పాకర్ పట్టుకునే సమయానికి కొన ఊపిరితో కొట్టుకుంటున్న చేప.. ఆ తరువాత మార్కెట్ తరలించే సమయానికి మరణించింది. అదే మార్కెట్ తరలించేసమయానకిి కూడా చేప బతికివుండి వుంటే అమెకు కిలోకు మరింత ధర పలికేంది. చేప మరణించడంతో అది తినేందుకు పనికి రాదని, కాగా, దానిలోని పలు అవయవ భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తుండటంతో 52 కిలోల చేప కేజీ రూ.6,200 ధర పలికింది. ఆ విధంగా ఆమెకు రూ.3 లక్షలకు పైగా సొమ్ము చేతికందింది. ఒక్క చేపతో లక్షలు వచ్చిపడడంతో ఆ వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ చేప కొవ్వు, ఇతర అవయవాలను ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తారట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more