(Image source from: Deccanherald.com)
కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ నివాసం సహా 14 ప్రాంతాల్లో ఇవాళ ఉదయం అకస్మికంగా సీబిఐ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసి తాము గెలవాలని బీజేపి ప్రయత్నిస్తూ.. ఈ మేరకు ప్రజల దృష్టిని మరల్చడానికి దాడులను నిర్వహిస్తుందన్న విమర్శల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివకుమార్ చెందిన ఢిల్లీ, ముంబై సహా కర్ణాటకలోని మొత్తం 14 ప్రాంతాల్లో దాడులు సీబిఐ అధికారులు దాడులు చేశారు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహాన్ని అదిలోనే నిరుత్సాహప పర్చేందుకు ఈ దాడులు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ దాడుల్లో బీజేపి ప్రభుత్వంపై వున్న వ్యతిరేకతను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. రాజకీయాల్లో ఎన్నడూ ఏ పార్టీ ఇంతటి నీచ రాజకీయాలకు పాల్పడలేదని, ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోనే ధైర్యం లేక కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీ.. తమ చేతిలో వున్న అధికారంతో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కక్ష సాధింపు రాజకీయాల కోసం వినియోగిస్తున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. కాగా శివకుమార్ కు చెందిన 14 ప్రాంతాల్లో దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దాదాపు 60 మందికి పైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొని శివకుమార్ సోదరుడు సురేశ్ నివాసాలు, ఆయన కార్యాలయాల్లోనూ దాడులు జరిపారు.
ప్రధాని నరేంద్రమోడీ మోదీ, సీఎం యడియూరప్ప చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారారని, ఆయన చెప్పిన 56 ఇంచుల ఛాతి ఎక్కడికి పోయిందో కానీ.. దొంగ మార్గాల ద్వారా.. ప్రజల దృష్టిని మరల్చి.. అధికారాన్ని కొనసాగించాలనే అలోచనలు ఈ దాడులు దర్పణం పడుతున్నాయని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా. ప్రధాని, యడ్డ్యూరప్పల ఆదేశాలతోనే దాడులకు దిగారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ ఇటువంటి చర్యలకు దిగుతోందని మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు.ఇటువంటి చర్యలతో తమను భయాందోళనలకు గురిచేయలేరని, ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more