75.29% candidates qualify in Telangana EAMCET exam తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడి.. అక్టోబర్ 9 నుంచి కౌన్సిలింగ్

Ts eamcet 2020 result 75 29 candidates qualify in telangana eamcet exam

TS EAMCET 2020 toppers list, Telangana EAMCET result, eamcet.tsche.ac.in, ts eamcet result, ts eamcet result 2020, ts eamcet results, telangana eamcet, telangana eamcet result, ts eamcet results 2020, JNTUH, Sabita Indra Reddy, Education Minister, toppers list, Telangana EAMCET Councelling, HYderabad, Telangana

The results of Telangana State Engineering Agricultural and Medical Common Entrance Test (TS EAMCET) 2020 was declared by Education Minister Sabitha Indra Reddy. Over 75 per cent of the candidates who appeared in the Telangana EAMCET 2020 exam for the engineering stream last month have qualified, officials said

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడి.. అక్టోబర్ 9 నుంచి కౌన్సిలింగ్

Posted: 10/06/2020 09:57 PM IST
Ts eamcet 2020 result 75 29 candidates qualify in telangana eamcet exam

తెలంగాణ ఎంసెట్-2020 ఫలితాలలో మళ్లీ అబ్యాయిలే పైచేయి సాధించారు. ఇవాళ వెల్లడైన ఫలితాలను జేఎన్టీయూ-హెచ్ క్యాంపస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. 75.29 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ లో టాప్-10 ర్యాంకులన్నీ బాలురే కైవసం చేసుకున్నారు. వారణాసి సాయితేజ ఎంసెట్ టాపర్ గా నిలిచాడు. యశ్వంత్ సాయి (2), టి.మణి వెంకటకృష్ణ (3), చాగరి కౌశల్ కుమార్ రెడ్డి (4), హార్దిక్ రాజ్ పాల్ (5) సాధించారు,

ఎంసెట్ పలితాలలో నాగెల్లి నితిన్ సాయి (6), కృష్ణ కమల్ (7), సాయివర్ధన్ (8), హర్షవర్ధన్ (9), వారణాసి వచన్ సిద్ధార్థ్ (10) టాప్-10లో ఉన్న మిగతా ర్యాంకర్లు. ఈ ఏడాది ఎంసెట్ కు 1,43,326 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 1,19,183 మందే హాజరు కాగా, 89,734 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాని విద్యార్థుల కోసం ఈ నెల 8న ప్రత్యేక ఎంసెట్ నిర్వహిస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఎంసెట్-2020 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. కౌన్సెలింగ్ను రెండు విడతలుగా నిర్వహించనున్నారు.

ఇంటర్లో ఎంపీసీ చదివి ఎంసెట్ ఇంజినీరింగ్ రాసిన విద్యారులు ఈ కౌన్సెలింగ్ ద్వారా బీటెక్, బీఫార్మసీలో సీట్లు పొందవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సీట్లను, ప్రైవేట్ కళాశాలల్లో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద ఈ కౌన్సెలింగ్ల ద్వారా భర్తీ చేస్తారు. ఈసారి మొదటి, చివరి కౌన్సెలింగ్లతోపాటు స్పాట్ ప్రవేశాల వివరాలను ముందుగానే వెల్లడించడం విశేషం. ప్రైవేట్ కళాశాలల్లో ఇంజినీరింగ్, బీఫార్మసీ స్పాట్ అడ్మిషన్లకు నవంబరు 4న మార్గదర్శకాలు జారీ చేస్తారు.

మొదటి విడత కౌన్సెలింగ్ తేదీలు
-అక్టోబర్ 9-17వ తేదీ వరకు ఆన్లైన్లో సమాచారం పూర్తి చేయడం, ధ్రువపత్రాల పరిశీలనకు తేదీ, సమయాన్ని అభ్యర్థులు ఎంచుకోవాలి.
అక్టోబర్ 12-18వ తేదీ వరకు: ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబర్ 12-20వ తేదీ వరకు: వెబ్ ఆప్షన్లు
అక్టోబర్ 22వ తేదీ: మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు
అక్టోబర్ 22-27వ తేదీ వరకు: ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్

రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు
అక్టోబర్ 29వ తేదీ: తొలి విడతలో హాజరుకాని వారు ధ్రువపత్రాల బుకింగ్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి.
అక్టోబర్ 30వ తేదీ ధ్రువపత్రాల పరిశీలన
నవంబరు 2న: సీట్ల కేటాయింపు
నవంబరు 2-5వ తేదీ వరకు: ట్యూషన్ ఫీజు చెల్లించడం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం చేయాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles