Why no action taken against YSRCP MPs, MLAs: HC 'న్యాయవ్యవస్థకు ఇదేనా మీరిచ్చే గౌరవం.?' స్పీకర్ పై హైకోర్టు ఆగ్రహం

Finally tammineni sitaram gets a bashing from the ap high court

Tammineni Sitaram, AP Assembly Speaker, YSRCP, Court proceedings, Court Judgements, Judiciary, Supreme Court, Unsatisfactory, AP High Court, Polictics

The Andhra Pradesh High Court has fumed at the Jagan government for its failure to initiate any action against YSRCP MPs and MLAs despite making adverse comments against the courts and judiciary. Hearing a petition, the High Court questioned why the government has not filed cases against the MPs and MLAs who tried to lower the dignity of the judiciary.

‘‘న్యాయవ్యవస్థకు ఇదేనా మీరిచ్చే గౌరవం.?’’ స్పీకర్ పై హైకోర్టు ఆగ్రహం

Posted: 10/08/2020 09:03 PM IST
Finally tammineni sitaram gets a bashing from the ap high court

న్యాయస్థానం వెలువరించిన తీర్పులపై అధికార పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు బాధ్యయుతమైన పదవుల్లో వున్న ఎంపీలు, ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలపై ఇవాళ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమ వేదికల్లో న్యాయవ్యవస్థను చులకన చేసే విధంగా వ్యవహరిస్తారా.? అంటూ మండిపడింది. ఈ వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యానికే విఘాతం కలింగిందని న్యాయస్థానం పేర్కోంది. ఈ వ్యాఖ్యలను న్యాయస్థానాలపై దాడిగానే పరిగణించాల్సి వుంటుందని ఈ సందర్భంగా రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టులను, న్యాయవ్యవస్థను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు ఎందుకని నమోదు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. అధికారంలో వున్న ప్రభుత్వంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వెంటనే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానాలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది, ఈ సందర్భంగా రిజిస్టార్ కేసు దాఖలు చేసినా.. పదవిలో వున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవ్యవస్థను తూలనాడిని వారిని రక్షించేందుకే కేసులు పెట్టలేదని భావించాల్సి వుంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తిరుమల కోండపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. ఈ పరిస్థితులను చూస్తూంటే న్యాయవ్యవస్థపై యుద్దం ప్రకటించినట్టు భావించాల్సి వుంటుందని ధర్మాసనం వ్యాఖ్యనించింది. హైకోర్టు వెలువరించిన తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని... బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ కేసులో సీబిఐ విచారణకు ఏజీ, సీఐడీలు అంగీకారం తెలిపిన తరువాత తీర్పును రిజర్వులో ఉంచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles