కరోనా వైరస్ వ్యాప్తితో దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల.. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మారటోరియం కాలనికి వడ్డీపై వడ్డీ వేస్తోందని దాఖలైన పిటీషన్లను విచారించిన న్యాయస్థానం.. దేశంలో లాక్ డౌన్ ను కేంద్రమే విధించింది.. కాబట్టి మారటోరియం కాలానికి వడ్డీపై వడ్డీని కూడా మినహాయించాల్సింది కేంద్ర ప్రభుత్వమే గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు పలు విషయాలు తెలిపింది. రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని మరోసారి పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ఆర్బీఐ దాఖలు చేసిన అవిడవిట్ లో పేర్కొంది. కరోనా వల్ల నష్టపోయిన ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమనాన్ని అందించలేమని తేల్చి చెప్పింది. వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా కేంద్ర సర్కారు స్పష్టతనిచ్చింది.
నిర్దిష్ట రంగ ఆధారిత ఆర్థిక ఉపశమన వివరాల్లోకి న్యాయస్థానం వెళ్లకూడని కేంద్ర సర్కారు, ఆర్బీఐ తెలిపాయి. మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపుల తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది. కరోనా వ్యాప్తికి ముందు రియల్ ఎస్టేట్, విద్యుత్ రంగాలు సంక్షోభంలో పడ్డాయని పేర్కొంది. దీంతో ఆయా రంగాల ఇబ్బందులను బ్యాంకింగ్ నిబంధనల ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more