తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో అభయమిచ్చారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. ఈ కల్పవృక్షం నీడన సేద తీరేవారికి ఎలాంటి ఆకలిదప్పికలు వుండవని, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం. మిగతా వృక్షాల మాదిరిగా అవి కాసిన ఫలాలను అందించే చెట్లకు భిన్నంగా కల్పవృక్ష వాహనం కోరిన ఫలాలన్నింటినీ అందిస్తుందని భక్తుల నమ్మకం.
అలాంటి కల్పవృక్ష వాహనంపై నాలుగో రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ పద్మావతి, అలిమేలుమంగలతో రాజమన్నార్ అలంకారంలో శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో ఊరేగిన శ్రీవారు అభయ ప్రధానం చేశారు, మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, ఇవాళ రాత్రి బ్రహోత్సవాలలో భాగంగా తిరుమల దేవదేవుడు సర్వభూపాలవాహనంపై దర్శనమివ్వనున్నారు. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more