Supreme Court serves notices to TDP over construction of party office in Mangalagiri పార్టీ ఆఫీసుకు భూకేటాయింపుపై సుప్రీం విచారణ.. ఉభయపక్షాలకు నోటీసులు

Supreme court serves notices to tdp over construction of party office in mangalagiri

Supreme Court, AP Government, Telugu desam party, TDP party office, YSRCP, Alla Ramakrishna Reddy, AP High Court, Andhra Pradesh, Politics

The supreme court heard the petition file by YSRCP MLA Alla Ramakrishna Reddy against the allotment of land to the TDP office in Mangalagiri of Guntur district. The Supreme Court has issued notices to the TDP, Andhra Pradesh government and the CRDA ordering to file counter in three weeks and adjourned the hearing for three weeks

పార్టీ ఆఫీసుకు భూకేటాయింపుపై సుప్రీం విచారణ.. ఉభయపక్షాలకు నోటీసులు

Posted: 10/27/2020 11:26 PM IST
Supreme court serves notices to tdp over construction of party office in mangalagiri

(Image source from: Telugudesam.org)

సీఆర్డీయే నిబంధనలను ఉల్లంఘించిన అక్రమ మార్గంలో అమరావతిలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి భూకేటాయింపుల జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను ఇవాళ విచారించిన జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని అత్యున్నత న్యాయస్థానం.. ఇటు అర్కే తో పాటు అటు ప్రతివాదుల వాదనలు కూడా వినింది. కాగా సదరు భూ కేటాయింపులను తక్షణం రద్దు చేయాలని పిటీషన్ లో కోరిన ఆయన వాదనల అనంతర న్యాయస్థాన ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు తెలుగుదేశం పార్టీకి కూడా నోటీసులను జారీ చేసింది.

3.65 ఎకరాల వాగు భూమిని కబ్జా చేసి పార్టీ ఆఫీసు నిర్మాణం జరిపారని ఆరోపించారు. ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఏపీ సర్కారుకు, తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు విచారణ వాయిదా వేసింది.ఎమ్మెల్యే ఆర్కే తరఫున ప్రశాంత్ భూషణ్, రమేశ్ వాదనలు వినిపించారు. జల వనరులతో సంబంధం ఉన్న భూమిని పార్టీ ఆఫీసుకు కేటాయించారని వారు కోర్టుకు తెలిపారు. జస్టిస్ నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయం ఉంది. ఇప్పటికే దీనిపై ఆర్కే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో, న్యాయం జరగలేదని భావించి సుప్రీంను ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles