(Image source from: Teluguin.com)
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో గల్లంతైన ఓవర్ మన్ రాపోలు నవీన్ కుమార్ (28) మృత్యువాత పడ్డాడు. నిన్న రాత్రి విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గనిలోని పైకప్పు కూలిన ఘటనలో ఆయన చిక్కకుపోయారు, ప్రమాద సమయంలో 1.8 మీటర్ల మందం ఉన్న పైకప్పు కూలి పడడంతో ఆయన బయటకు తప్పించుకునే మార్గం కనిపించలేదు, అయితే నవీన్ కుమార్ తో పాటుగా చిక్కుకుపోయిన మరో ఐదుగురు అతికష్టం మీద తప్పించుకోగా, ఎస్‌డీఎల్ తాత్కాలిక ఆపరేటర్ కలవేణి సతీశ్ (31) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
బొగ్గు పొరల కింద చిక్కుకుపోయిన నవీన్ కుమార్ కోసం రెస్క్యూటీం 12 గంటలుగా గాలిస్తుండగా, చివరికి విగతజీవిగా కనిపించాడు. గని నుంచి అతడి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు బయటకు తీసుకువచ్చాయి,సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. సింగరేణి గనుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం సాధారణమే అయినా విలువైన కార్మికుల ప్రాణాలు పోవడం మాత్రం ఈ మధ్యకాలంలో అరుదు. దీంతో మృతుడి కుటుంబానికి తగు న్యాయం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
మరికాసేపట్లో విధులు ముగుస్తాయనగా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం నవీన్ కుమార్ ను పిన్నవయస్సులోనే అనంతలోకాలకు తీసుకెళ్లింది. ఆయనపైనే ఆధారపడిన కుటుంబాన్ని అన్యాయం చేసింది. బొగ్గు గని నుంచి ఆయన మృతదేహం తీసుకువచ్చేందుకు కూడా రెస్క్యూ బృందాలు 12 గంటల మేర శ్రమించాల్సి వచ్చింది, మృతుడు రాపోలు నవీన్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కార్మిక సంఘాల నేతలతో యాజమాన్యం చర్చలు జరుపినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more