Reservations in GHMC elections 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ల జాబితా ఇలా..

Reservations in ghmc elections 2020 announced

GHMC elections, corporator divisions reservation, state election commission, GHMC Governing body, GHMC polls, Reservations in GHMC elections, Hyderabad, Telangana, politics

The state election commission of Telangana announced reservations for 106 wards in GHMC(Grater Hyderabad Municipal Corporation) elections 2020.In this GHMC polls 2020 women has got A total of 44 divisions have been reserved for women in various reservations.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లను సిద్దం చేసిన బల్దియా

Posted: 11/03/2020 01:26 AM IST
Reservations in ghmc elections 2020 announced

గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంఘం ఎన్నికలకు రంగం సిద్దం చేస్తూనే.. ఓ వైపు ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాలను చేసుకుంటున్న ఎన్నికల కమీషన్ త్వరలోనే గ్రేటర్ బల్దియా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యతను కూడా చేపడుతూనే వుంది. ఇప్పటికే అకాలవర్షంతో పాటు ముంపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన కారణంగా గ్రేటర్ లో ఎన్నికల కసరత్తును ప్రారంభించడంలో కొంత అంతరాయం ఏర్పడింది. దీంతో ఇక తమ వైపు నుంచి ఎలాంటి జాప్యం వుండరాదని బావిస్తోన్న రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇక శరవేగంగా తన కార్యాలను పూర్తి చేస్తోంది.

ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ మేరకు జాబితాను సిద్దం చేసిన ఈసీ ఇవాళ దానిని ప్రకటించింది, ఇందులో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు పది స్థానాలు రిజర్వు కాగా, మొత్తంగా మహిళలకు 75 డివిజన్లను రిజర్వు చేశారు. 44 స్థానాలు అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీలో ఉన్నాయి. పాలకమండలి రిజర్వేషన్లను రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం చట్టం చేయడంతో గతంలో చేసిన రిజర్వేషన్లు యథావిథిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు బల్దియా అధికారులు డివిజన్ల వారీగా రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు.

రిజర్వు అయిన డివిజన్ల వివరాలు ఇలా...

ఎస్టీ(జనరల్‌)- ఫలక్‌నుమా

ఎస్టీ(మహిళ)- హస్తినాపురం

ఎస్సీ(జనరల్‌)- కాప్రా, మీర్ పేట్‌, హెచ్ బీ కాలనీ, జియాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.

ఎస్సీ(మహిళ)- రాజేంద్రనగర్‌, అడ్డగుట్ట, మెట్టుగూడ, బన్సీలాల్ పేట్‌, కవాడిగూడ

బీసీ (జనరల్‌)-

చర్లపల్లి, సిఖ్ చావ్నీ, సంతోష్ నగర్‌, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహల్‌, పురానాపూల్‌, దూద్ బౌలి, జహనుమా, రామ్ నాస్ పుర, కిషన్ బాగ్‌, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్‌, కార్వాన్‌, నానల్ నగర్‌, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్‌, అంబర్ పేట, భోలక్ పూర్‌, బోరబండ, రామచంద్రాపురం, పటాన్ చెరువు, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్‌.

బీసీ(మహిళ)

రామంతాపూర్‌, ఓల్డ్‌ మలక్ పేట, తలాబ్‌ చంచలం, గౌలిపుర, కుర్మగూడ, కంచన్ బాగ్‌, బార్కాస్‌, నవాబ్‌ సాహెబ్‌ కుంట, ఘాన్సీబజార్‌, సులేమాన్‌ నగర్‌, అత్తాపూర్‌, మంగళ్ హాట్‌, గోల్కొండ, టోలీచౌకి, ఆసిఫ్‌నగర్‌, విజయనగర్‌ కాలనీ, అహ్మద్ నగర్‌, మల్లేపల్లి, రెడ్ హిల్స్‌, గోల్నాక, ముషీరాబాద్‌, ఎర్రగడ్డ, చింతల్‌, బౌద్ధనగర్‌, రాంగోపాల్ పేట్‌.

మహిళ(జనరల్‌)

డా. ఎ.ఎస్‌.రావు నగర్‌, నాచారం, చిలుకానగర్‌, హబ్సిగూడ, ఉప్పల్‌, నాగోల్‌, సరూర్ నగర్‌, రామకృష్ణాపురం, సైదాబాద్‌, ముసారాంబాగ్‌, ఆజంపుర, మొగల్ పుర, ఐఎస్‌ సదన్‌, లంగర్ హౌస్‌, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్‌, కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట్‌, అడిక్ మెట్‌, గాంధీనగర్‌, ఖైరతాబాద్‌, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, అమీర్ పేట్‌, సనత్ నగర్‌, హఫీజ్ పేట్‌, చందానగర్‌, భారతీనగర్‌, బాలాజీనగర్‌, అల్లాపూర్‌, వీవీ నగర్‌, సుభాష్ నగర్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, అల్వాల్‌, నేరేడ్ మెట్‌, వినాయకనగర్‌, మౌలాలీ, గౌతంనగర్‌, తార్నాక, సీతాఫల్ మండీ, బేగంపేట్‌, మోండా మార్కెట్‌.

రిజర్వు కానివి..

మల్లాపూర్‌, మన్సూరాబాద్‌, హయాత్‌ నగర్‌, బీఎన్‌ రెడ్డి నగర్‌, వనస్థలిపురం, చంపాపేట్‌, లింగోజిగూడ, కొత్తపేట్‌, చైతన్యపురి, గడ్డిఅన్నారం, అక్బర్‌ బాగ్‌, డబీర్‌ పుర, రెయిన్‌ బజార్‌, పత్తర్‌ గట్టి, లలితాబాగ్‌, రియాసత్‌నగర్‌, ఉప్పుగూడ, జంగమ్మెట్‌, బేగంబజార్‌, మైలార్‌ దేవ్‌ పల్లి, జాంబాగ్‌, రాంనగర్‌, బంజారాహిల్స్‌, షేక్‌ పేట్‌, జూబ్లీహిల్స్‌, యూసుఫ్‌ గూడ, వెంగళరావునగర్‌, రహ్మత్‌ నగర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్‌, మియాపూర్‌, కేపీహెచ్బీ కాలనీ, మూసాపేట్‌, ఫతేనగర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, బాలానగర్‌, కూకట్‌ పల్లి, హైదర్‌ నగర్‌, ఆల్విన్‌ కాలనీ, సూరారం, ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌, మల్కాజిగిరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles