Arnab Goswami shifted to Tajola jail అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్..

Arnab goswami shifted to tajola jail after he was found active on social media

Arnab Goswami,Bombay High Court, Republic TV, Editor-in-Chief, judicial custody, architect Anvay Naik, non-payment of duesm abetment to suicide case, Arnab Goswami interim bail plea, N M Joshi Marg police station, Maharashtra, crime

The Raigad police shifted Republic TV's promoter, MD and chief editor Arnab Goswami to Taloja jail in Navi Mumbai from a makeshift quarantine centre-turned-jail in Alibaug on Sunday morning, a sudden move that they said was necessitated by their discovery that he was on social media from a mobile phone while in judicial custody.

తలోజా జైలుకు అర్నాబ్ గోస్వామి.. ఫేస్ బుక్ లో యాక్టివ్ గా వున్న ఫలితం..

Posted: 11/09/2020 03:30 PM IST
Arnab goswami shifted to tajola jail after he was found active on social media

రిపబ్లిక్ టీవీ సీఈఓ, ఎండీ అర్నాబ్ గోస్వామిని బెయిల్ పిటీషన్ ను ఇవాళ మరోమారు విచారణకు రానుంది. వరుసగా నాల్గవ రోజు న్యాయస్థానం అర్నబ్ గోస్వామి బెయిల్ పిటీషన్ పై విచారణ జరపనుంది. 2018లో అర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ అతని తల్లి కుముద్ ఆత్మహత్యలకు పాల్పడిన కేసులో అభియోగాలను ఎదుర్కన్న ముగ్గురిలో ప్రధాన నిందితుడైన అర్నబ్ గోస్వామి తన అరెస్టు అన్యాయమని, బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన అరెస్టై ఐదు రోజులు కావస్తున్నా ఇప్పటికీ అతని ఊరట లభించలేదు, మధ్యంతర బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటీషన్ పై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది.

కాగా గత బుధవారం రోజు ఆయనను రాయిగడ్ పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రతివాది, రాష్ట్రప్రభుత్వం, అన్వయ్ నాయక్ కుటుంబ సభ్యుల పిటిషన్‌లతో పాటు వారి వాదనలను కూడా న్యాయస్థానం వినింది. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేసినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును తిరిగి తెరిచింది. కాగా అర్నాబ్ ప్రస్తుతం కోవిడ్ కేంద్రంగా మార్చిన రాయ్ గడ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నాడని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను పోలీసులు తలోజా జైలుకు తరలించారు.

నాలుగు రోజుల పాటు క్వారంటైన్ కేంద్రంలో వున్న ఆయన అక్కడ ఎవరి మొబైల్ ఫోన్ తోనే తన ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యారని, దాదాపు రెండు గంటల పాటు ఆయన అన్ లైన్ ద్వారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నారని పోలీసులు గుర్తించారు, దీంతో ఆయనను అలిబాగ్ లోని తాత్కాలిక నిర్భంధ కేంద్రం నుంచి అన్ని అనుమతులు పోందిన తరువాత అర్నబ్ గోస్వామిని నవి ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. కాగా, నాలుగు రోజులుగా ఆయన క్వారంటైన్ కేంద్రంలో వున్న ఆయనకు పరీక్షలు నిర్వహించి.. అతనికి కరోనా వైరస్ వ్యాప్తించలేదని నివేదిక రావడంతో తలోజా జైలు అధికారులకు దానిని సమర్పించిన తరువాత ఆయనను తరలించారు.

అయితే అర్నబ్ టీవీ ఛానెల్ మాత్రం ఆయనకు సోషల్ మీడియా అకౌంట్ లేదని వాదిస్తూ.. పోలీసుల కథనాలను బలంగా తోసిపుచ్చింది. అర్నబ్ వ్యక్తిగత మొబైల్ ఫోను కూడా అరెస్టు సందర్భంలో పోలీసులు సీజ్ చేశారని పేర్కోనింది. ఇక ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న అంశమై అలిబాగ్ జైలు అధికారులకు కేసు దర్యాప్తు అధికారిగా వున్న షేక్ విచారించాల్సిందిగా కోరారు, కాగా ఈ సందర్భంగానే తనను తరలిస్తున్న వ్యానులోంచి అర్నబ్ గోస్వామి తనపై అలిబాగ్ జైలర్ దాడి చేస్తున్నారని, తనను రక్షించాలని అరుపులు వేయడం గమనార్హం. అయితే అర్నబ్ గోస్వామి అరోపణలను ఖండించారు. ఇక తలోజా జైలు అధికారి అబాసాహెబ్ పాటిల్ క్వారంటైన్ కేంద్రంలో తనపై దాడి జరిగిందన్న వాఖ్యలను తోసిపుచ్చారు. అలాంటిదైమైనా జరిగితే అక్కడి సీసీటీవీల ఫూటేజీలను పరిశీలిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles