చట్టం కోరలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అన్న విషయం నిందితులకే కాదు.. ఆ శాఖకు చెందిన అధికారులకు కూడా బాగా తెలుసు. అయినా.. శాఖపరంగా ఉన్నత హోదాల్లో వున్న అధికారులు మాత్రం తామే చట్టం అన్నట్లుగా వ్యవహరించి.. అడపాదడపా చట్టాన్ని అతిక్రమిస్తూనే వుంటారు. ఇది చూసి నిందితులు కూడా అదే మార్గాన పయనిస్తున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకున్నప్పటికీ.. నిందితుల నుంచి ఏదో ఒక లబ్ది లేకుండా వారిని వదిలేందుకు ఈ అధికారులకు మనస్సు అంగీకరించదు.. అన్నది ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. ఐపీఎల్ బెట్టింగులో అడ్డంగా దొరికిన ఓ నిందితుడ్ని పట్టుకున్న కామారెడ్డి పోలీసలు చట్టప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు.
ఇంతవరకు బాగానే వున్నా.. నిందితుడ్ని రిమాండ్ కు తరలించకుండా స్టేషన్ బెయిల్ ఇప్పిస్తామని, అందుకు ఏకంగా ఐదు లక్షల రూపాయల మేర డిమాండ్ చేసి లంచావతారాన్ని ఎత్తాడు కామారెడ్డి సిఐ జగదీష్. తనకు అత్యంత సన్నిహితుడైన సుజయ్ అనే వ్యక్తి ద్వారా ఈ డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా మొదటి విడత కింద రూ. 1,39,500 తీసుకుని అదే రోజున నిందితుడు సుధాకర్ ను విడిచిపెట్టాడు. ఇక ఉన్నతాధికారుల దృష్టిలో తాను ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహించే వ్యక్తిని పట్టుకున్న సిఐగా ఓ వైపు ఘనతను సంపాదిస్తూనే.. మరోవైపు ఐపీఎల్ బెట్టింగుకు పాల్పడిన కామారెడ్డి పట్టణవాసి బత్తుల సుధాకర్ తో బెయిల్ డీల్ కుదుర్చుకుని... చట్టాన్ని అతిక్రమించాడు.
ఈ కేసులో ఈ నెల 8నే స్టేషన్ బెయిల్ పై విడుదలైన సుధాకర్ కు సిఐ వేధింపులు అధికం అయ్యాయి, స్టేషన్ బెయిలు నేపథ్యంలో ఇస్తానని చెప్పిన మిగతా సొమ్ము కోసం పట్టణ సీఐ జగదీశ్ సుబయ్ ద్వారా అతడ్ని వేధించ సాగాడు. దీంతో వేగలేకపోయిన సుధాకర్ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 19న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిన్న తెల్లవారుజామున కామారెడ్డిలోని సీఐ ఇంటికి చేరుకుని సోదాలు చేశారు. రాత్రి వరకు జరిగిన ఈ సోదాల్లో సీఐ అవినీతికి సంబంధించి పలు ఆధారాలు లభించాయని, జగదీశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more