తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత నిచ్చెలి శశికళ ముందుస్తు విడుదల వార్తలపై కర్ణాటక ప్రభుత్వం తాజాగా నీళ్లు చల్లింది. అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరెస్టై నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సిందిగా న్యాయస్థానం తీర్పును ఇవ్వడంతో.. అమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం అదేశానుసారం అమెకు విధించిన జరిమానా రూ. పది కోట్ల రూపాయలను అమె తరపు న్యాయవాది ఎన్ రాజా సెంథూర్ పాండియన్ 34వ సిటీ సివిల్ కోర్టులో గత బుధవారం చెల్లించారు. దీంతో శశికళ ముందస్తు విడుదల వార్తలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ విషయమై తాజాగా కర్ణాటకా ప్రభుత్వం క్వారిటీ ఇచ్చింది. ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ఈ విషయమై స్పందిస్తూ శశికళ ముందస్తు విడుదల అసాధ్యమన్నారు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును తమ ప్రభుత్వం తూచ తప్పకుండా పాటిస్తుందని.. న్యాయస్థానం తీర్పు మేరకు శశికళ తన పూర్తి శిక్ష కాలం పూర్తైన తరువాతే విడుదల అవుతుందన్నారు. అయితే రూ. 10 కోట్ల జరిమానా చెల్లించిన తరువాత ఏ క్షణంలో అయినా అమె జైలు నుంచి విడుదల కావచ్చునని వచ్చిన వార్తలకు ఇక బ్రేక్ పడినట్టు అయ్యింది, చట్టప్రకారమే అంతా జరుగుతుందని ఆయన చెప్పడంతో అమె విడుదల ఫిబబ్రవరిలోనే జరుగుతుందని దీంతో ఆమె ముందస్తు విడుదల కోసం ఎదురుచూస్తున్న బంధువులు, అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
నిజానికి నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించిన తరువాత.. శశికళ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కావాల్సి ఉంది. అయితే జైలులో అమె సత్ప్రవర్తన కారణంగా జనవరి 27న విడుదల చేయనున్నట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. జైలులో ఉన్న శశికళ నాలుగేళ్ల కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే, అది కూడా ఆమె భర్త మృతి చెందినప్పుడు మాత్రమే పెరోల్‌పై బయటకు వచ్చారని, ఆ తర్వాత ఎప్పుడూ పెరోల్ కోరలేదని ఆమె తరపు న్యాయవాది రాజా సెందూర్ పాండియన్ తెలిపారు. దీనికి తోడు ప్రభుత్వ సెలవులు కూడా కలుపుకుంటే, ముందుగానే విడుదలయ్యే అవకాశాలు వున్నాయని అన్నారు, కాగా, మంత్రి బసవరాజ్ అందుకు భిన్నమైన ప్రకటన చేయడంతో ఆమె ముందస్తు విడుదలకు మరో మూడు నెలలు ఆగాల్సిందేనన్న వార్తలు వినబడుతున్నాయి, కావాలన్నది జైలు నిబంధనలే చెబుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది జనవరి 27 కంటే ముందు ఆమె జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేనట్టే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more