BJP keen on winning GHMC Elections జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపి దిగ్గజాలు..

Amit shah yogi adityanath and jp nadda to campaign in ghmc elections

GHMC Elections, GHMC Elections Amit Shah, GHMC Elections YogiAdityanath, GHMC Elections JP Nadda, Amit Shah, YogiAdityanath, JP Nadda, GHMC Election Campaign, Dubbaka Assembly, Greater Hyderabad Elections, BJP, Hyderabad, Telangana, Politics

Buoyed by the victory in Dubbaka Assembly by-election in Telangana, the BJP national leadership is giving top priority to capturing the GHMC elections, slated to be held on 1 December. Union Home Minister Amit Shah and BJP President J.P. Nadda-indicate the amount of importance given by them to the GHMC elections.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపి దిగ్గజాలు.. పలువురు అగ్రనేతలు

Posted: 11/24/2020 10:44 PM IST
Amit shah yogi adityanath and jp nadda to campaign in ghmc elections

(Image source from: Jagran.com)

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా జరుగుతున్నాయి, గత పర్యాయం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు అధికార పార్టీకి నల్లేరుపై నడకలా సాగినా, ఈ పర్యాయం మాత్రం బీజేపి పార్టీ నుంచి గట్టి పోటీనే ఎదుర్కోంటోంది. దుబ్బాక ఉపఎన్నిక అందించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బీజేపి కూడా దూసుకుపోతోంది. ఈ నెల 3న జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార పార్టీతో నువ్వానేనా అన్నట్లు పోటీ ఏర్పడినా.. 10వ తేదీని విడుదలైన ఫలితాలలో మాత్రం బీజేపి పైచేయి సాధించింది. దీంతో బీజేపి కార్యకర్తలు జీహెచ్ఎంసీ ఎన్నికలలోనూ తామ పార్టీకి విజయాన్ని అందించాలన్న కృతనిశ్చయంతో ఉత్సాహంగా ప్రచారంలో దూసుకుపోతోంది.

ఇప్పటికే బీజేపి రాష్ట్ర స్థాయి నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలను అకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు యువనేతలు ఎంపీ ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజాసింగ్, లక్ష్మణ్, రామచంద్రారెడ్డి సహా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, డీకే అరుణతో పాటుగా పలువురు నేతలు ప్రచారంలో దూసుకెళ్తుండగా, బెంగళూరు బీజేపి ఎంపీ, బీజేపి యువమోర్చా జాతీయ నేత తేజస్వీ సూర్య కూడా రాష్ట్ర నాయకులతో పాటు ప్రచారంలో పాలుపంచుకుంటూ యువతను, ఓటర్లను తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు, ఇక ఈ ఎన్నికలలో తమ విజయాన్ని చాటితే దీనిని చూపి రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఇంతకు మించిన పోటీని ఇచ్చి.. రాష్ట్రంలో అధికారాన్ని కూడా అందుకోవాలని బీజేపి జాతీయ స్థాయి నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపి జాతీయ స్థాయి నాయకులకు కూడా నిర్ణయాత్మకంగా మారాయి, దీంతో ఈ ఎన్నికల ప్రచారానికి బీజేపి పలువురు జాతీయ నేతలను రంగంలోకి దింపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీహెఛ్ఎంసీ ఎన్నికలలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు, వీరితో పాటు మరికొంతమంది అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక వీరి హైదరాబాద్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ను మాజీ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన భూపేంద్ర యాదవ్‌ ఇప్పటికే రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తోన్న విషయం తెలిసిందే.   

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినా.. లేక రెండో స్థానంలో నిలిచినా తమ పార్టీ కార్యకర్తలు, శ్రేణులలో నూతనోత్సాహం వస్తుందని, దీంతో వారు రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత జోష్ తో పనిచేసిన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అస్కారం అధికంగా వుందని బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇందుకు అనుగూణంగా తెలంగాణలో కాంగ్రెస్ లోని ప్రముఖ నేతలను తమ పార్టీలో కలుపుకోవడం కూడా వ్యూహంలో భాగమేనని వార్తలు వినిపిస్తున్నాయి, ఇప్పటికే మాజీ ఎంసీ సర్వే సత్యనారాయణ బీజేపిలో చేరగా, ఇక జేపి నడ్డా ఆద్వర్యంలో విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. అయితే అమె పార్టీలో  చేరిన తరువాత అమె కూడా జీహెఛ్ఎంసీ ఎన్నికలలో బీజేపి తరపున ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC Elections  Amit Shah  Yogi Adityanath  JP Nadda  GHMC Election Campaign  BJP  Hyderabad  Telangana  Politics  

Other Articles