పెద్దల మాట సద్దన్న మూట అంటారు. అలాంటి పెద్దలే పలు సందర్భాల్లో మనమంతా తొలు బొమ్మలమని, అడించేది మాత్రం పైవాడని, అదే విధి అని అంటుంటారు. ఈ మాటలు విన్నప్పుడు ఇప్పటి జనరేషన్ వారికి అంతా చాదస్తం అనిపిస్తోంది. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఔరా.! విధి ఎంతటి విచిత్రమైనది. వాహనాలు తిరుగుతున్న రోడ్డుపై ఓ పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి మాత్రమే ఇలాంటి దుర్ఘటన ఎలా ఎదురైందన్న ప్రశ్నలు వినిపించక మానవు. ఇదే విధి అని అనిపించక తప్పదు. రోడ్డు పక్కనే నిర్మితమవుతున్న ఓ భవనంలో పై నుంచి ఓ పిల్లర్ ఉన్నట్టుండి కూలడం.. అది సరాసరి నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పడటం విధి కాకపోతే మరేంటీ.
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ పట్టణంలో జరిగిందీ దుర్ఘటన. వివరాల్లోకి వెళ్తే.. భరత్ పూర్ లోని సరఫా మార్కెట్ ప్రాంతంలో ఓ రోడ్డు పక్కనే ఓ భవనం నిర్మితం అవుతోంది. దాని ఎదురుగా వున్న రోడ్డు పక్కనుంచి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతే అకస్మాత్తుగా ఆ భవనం మూడో అంతస్థు నుంచి ఓ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయి వారిపై పడిపోయింది. ఆ ఇద్దరిలో ఒకరి తలపై అది నేరుగా పడడంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై లేవలేని స్థితిలో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడితో ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అయితే తొలుత ఓ ఇటుక అతని వీవుపై తాకడంతో ఆయన ముందుకు పరుగెత్తాడు. దీంతో అతనికి కుడి చేతు, కాలుకి స్వల్పగాయాలయ్యాయి.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతోంది. భరత్ పూర్ పోలీసులు రంగంలోకి దిగి.. తీవ్రంగా గాయపడిన యువకుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడి పరిస్థితిపై వైద్యులను ఆరా తీసారు. క్షతగాత్రుడు పరిస్థితి నిలకడగా వుందని, అతను కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారని చెప్పారు, రోడ్డు పక్కనున్న ఓ దుకాణంలో నిర్మాణపు పనులు కోనసాగుతున్న తరుణంలో ఓ పిల్లర్ కూలిపోవడంతో ఈ ఘటన సంభవించిందని పోలీసులు తెలిపారు. కాగా దుకాణ యజమానితో మాట్లాడడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
#WATCH | An under-construction pillar in a market in Rajasthan's Bharatpur, collapses on a pedestrian passing by from below (16.12.2020) pic.twitter.com/N4knEBRU65
— ANI (@ANI) December 17, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more