Bhuma Akhilapriya Agitation in support of farmers రైతులకు మద్దతుగా భూమా అఖిలప్రియ జాతీయ రహదారి దిగ్భంధం..

Bhuma akhilapriya sudden agitation in support of farmers on national highway

Bhuma AkhilaPriya, National Highway, Allagadda, farmers protest, Sudden Agitation, Nivar cyclone, agriculture laws, kurnool farmer protest, farmers strike, AP farmers highway blockage, farmers protest in Kurnool, allagadda farmers protest, farmers protest in allagadda, Andhra Pradesh, Politics

As several farmers suffered due to Nivar cyclone and were anxioulsy looking for the helping hand from the state governement in the form of financial aid.. TDP top leader Bhuma Akhilapriya came to in support of farmers. The former minister held blockage of National Highway at Allagadda and demanded the govt to give compensation to the farmers.

రైతులకు మద్దతుగా భూమా అఖిలప్రియ జాతీయ రహదారి దిగ్భంధం..

Posted: 12/17/2020 10:35 AM IST
Bhuma akhilapriya sudden agitation in support of farmers on national highway

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఓ వైపు హస్తినలో రైతులు గత 22 రోజులుగా నిరసన దీక్షలను చేపడుతుండగా, తాజాగా అదే అంశాన్ని ఎంచుకుని టీడీపీ అగ్రనేత భూమా అఖిలప్రియ కూడా కర్నూలులో మెరుపు ధర్నా చేపట్టారు. నివర్ తుపాను తమ రాష్ట్ర రైతంగాన్ని తీవ్ర నష్టాలకు గురిచేసిందని, చేతికందాల్సిన పంట నీట మునిగి రైతన్న కుదేలయ్యాడని అమె అవేదన వ్యక్తం చేశారు. ఈ రైతులను అదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిది కాదా.? మరెందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు. రైతులను అదుకునేందుకు మీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదా.? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి భూమా అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నివర్ తుపాను వల్ల పంటను నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆళ్లగడ్డ హైవేపై భైఠాయించి మెరుపు ధర్నాకు దిగిన అమె.. పరిహారం అందించడంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అందోళన చేపట్టారు. రైతులకు నష్ట పరిహారం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆళ్లగడ్డలో మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు వైసీపీ ప్రభుత్వమే పురుడుపోసింది అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిరసనలకు అనుమతి లేదని, ఆందోళనను విరమించాలని అఖిలప్రియను కోరారు. అయినా చాలా సేపు అందోళనకారులు రోడ్డు మీదే భైఠాయించారు, దీంతో హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భూమా అఖిలప్రయిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు, ఆళ్లగడ్డ పట్టణ పరిధిలో కొవిడ్ నిబంధనల మేరకు సెక్షన్-30 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారని, వాహన రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ అమెపై కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు మరో 25 మంది టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేసినట్టు ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles