BJP's Dharma Yatra to Ramatheertham temple foiled ధర్మయాత్ర అడ్డగింత.. అదుపులో సోమువీర్రాజు..

Bjp jsp chalo ramateertham rally witnesses tense moments in vizianagaram

Andhra BJP President, Somu Veerraju, JanaSena, Pawan Kalyan, House Arrests, Nadendla Manohar, chalo Ramateertham dharma yatra, Amaravati, HIndus, Temples, Cm Ramesh, Kamineni srinivasa rao, vishnuvardhan reddy, YSRCP, BJP, TDP, Andhra Pradesh, Politics

The BJP and Jana Sena Party (JSP) Chalo Ramateertham Rally witnessed tense moments with police obstructing the rally and taking many BJP-JSP leaders and activists into their custody at various places in Vizag and Vizianagaram districts. Though BJP state president Somu Veerraju along with some BJP activists reached Nellimarla junction to visit the Sri Kodanda Ramaswamy Temple, he was taken into custody by Vizianagaram police.

రామతీర్థంలో బీజేపి, జనసేన నేతల అరెస్టు.. అదుపులో సోమువీర్రాజు..

Posted: 01/05/2021 09:28 PM IST
Bjp jsp chalo ramateertham rally witnesses tense moments in vizianagaram

(Image source from: Twitter.com/somuveerraju)

రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హిందూ సంప్రదాయాలపై, హిందూ దేవాలయాలపై ఎలాంటి గౌరవం, నమ్మకం లేకుండా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. హిందూ దేవాలయాలపై క్రమం తప్పకుండా దాడులు జరుగుతున్న పరిణామాలు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు, హిందువుల మనోభావాలను అవహేళన చేసే విధంగా ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు, రామతీర్థం ధర్మయాత్రకు ముందుగానే పిలుపునిచ్చినప్పటికీ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.

విజయనగరం జిల్లాలో కొదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపి, జనసేన సంయుక్తంగా రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి, ఈ పిలుపుమేరకు ఇవాళ రామతీర్థానికి వెళ్తున్న బీజేపి, జనసేన నేతలను తెల్లవారుజామునుంచే పోలీసులు గృహనిర్భంధం చేశారు, ఇక విజయనగరం చేరకున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా ధర్మయాత్రలో పాల్గోనకుండా అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. సెక్షన్ 30 అమల్లో వున్నందున ఎలాంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు, సోమువీర్రాజుతో పాటు పలువురు బీజేపి నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల ఠాణాకు తరలించారు.

పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపి, జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు, కొదండరాముడి ఆలయంలో జరిగిన ఘటనను నిరసిస్తూ తాము చేపట్టిన ధర్మయాత్రకు ఎందుకు వున్నఫళంగా అనుమతులను నిరాకరించారని బీజేపి నేతలు ప్రశ్నించారు. అధికార వైసీపీ, విఫక్ష టీడీపీ నేతలను అనుమతించిన ప్రభుత్వం, పోలీసు యంత్రాం.. జనసేనతో పాటు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు, వెంటనే గృహనిర్భంధంలో వుంచిన బీజేపి, జనసేన నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా విశాఖలోని బీజేపి కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లను విశాఖ ఏసీపీ మూర్తి, శ్రావణ్ కుమారులు అడ్డుకున్నారు.

కోదండ రామస్వామి విగ్రహ శిర‌చ్ఛేద‌న‌ దుస్సంఘ‌ట‌న‌ను ఖండిస్తూ తాము చేపట్టిన యాత్ర‌ను ప్ర‌భుత్వం అడ్డుకుంటోన్న తీరును ఖండిస్తున్నామ‌ని జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ప్ర‌క‌ట‌నలో తెలిపారు. నిన్న రాత్రి నుంచే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని జ‌న‌సేన వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుల‌ను, నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తామ‌ని బెదిరించ‌డం ప్రారంభించార‌ని చెప్పారు. ఈ రోజు తెల్ల‌వారు జాము నుంచే నేత‌ల‌ను, శ్రేణుల‌ను గృహ నిర్బంధంలో ఉంచ‌డంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేష‌న్ల‌కు తీసుకెళ్లార‌ని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని ఆయన అరోపించారు.

(Video Source: NTV Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles