ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు కూడా పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబడుతున్నాయి. కోవిడ్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు కరోనా వాక్సీన్ ను కేంద్ర ప్రభుత్వం దేశపౌరులకు అందించే సమయంలో ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించడం సముచితం కాదని స్పష్టం చేస్తున్నాయి,
ఎన్నికల నిర్వహణ విషయంలో కమీషనర్ మరోమారు పునరాలోచన చేయాలని ఏపీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి డిమాండ్ చేసింది. ఇప్పటికే ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్డును విడుదల చేస్తామని ప్రకటించగా, అదే సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా రంగంలోకి దిగి కరోనా కష్టకాలంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడాన్ని తప్పుబట్టింది, ఉద్యోగులు కూడా కరోనా విషయంలో అందోళన చెందుతున్నారని, ఉద్యోగుల ప్రాణాలను పణ్ణంగా పెట్టి ఎన్నికల నిర్వహణ చేయలేమని జేఏసీ నేతలు తేల్చిచెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై.. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి .. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఇది కరెక్ట్ టైం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో… జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‍ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more