భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన బర్డ్ ఫ్లూ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇవాళ అటు దేశరాజధాని ఢిల్లీతో పాటు అర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్రకు కూడా పాకింది, దీంతో తొమ్మిది రాష్ట్రాలలో భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు ఈ వైరస్ బారిన పడి మృత్యువాతపడుతున్నాయి.
మహారాష్ట్రాలోని పర్బణీ జిల్లా మురుంబా పౌల్ట్రీఫారంలో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి. దీంతో ఈ కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టులో ఆ కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మృతి చెందినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మురుంబా గ్రామానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ఫారాల్లోని అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించారు. గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లను ఇతర జిల్లాలకు తరలించకూడదని కూడా ఆదేశించారు. ఇప్పటివరకూ కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, యూపీ, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి.
బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. దీంతో వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీలోకి ప్రవేశించింది. ఇటు తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలోకి కూడా బర్డ్ ప్లూ వ్యాపించిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. చిన్న గంజాం మండలం పల్లెపాలంలోని సముద్ర తీర ప్రాంతంలో కాకులు, గోరింకలు చనిపోయాయి. ఐదు కాకులు, మూడు గోరువంకలు ఒకేచోట చనిపోయి ఉండడంతో…అవి బర్డ్ ఫ్లూ వల్లే మరణించి ఉంటాయని గ్రామస్థులు భయపడుతున్నారు. గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more