Court refuses to grant bail to Bhuma Akhila Priya సికింద్రాబాద్ కోర్టులో భూమా అఖిలప్రియకు మరో పరాభవం..

Bowenpally kidnap case ap former minister bhuma akhila priyas bail plea rejected

Bhuma Akhila Priya, Bhargava Ram, Bowenpally Kidnap case, police custody, secundrabad court, CCTV footage, Kidnap case, Hockey player Praveen Rao, Praveen Rao kidnap case, Bowenpally, Allagadda, Kurnool, Hyderabad, Hyderabad latest news, Telangana, Crime news

The Secunderabad court refused to grant bail to former TDP minister Bhuma Akhila Priya, who is lodged in Chanchalguda jail in the kidnap case. The police filed a memo with additional sections opposing bail to Akhila Priya. She is A1 in the kidnapping of former national badminton player Praveen Rao and his brothers over land at Hafeezpet in Hyderabad.

సికింద్రాబాద్ కోర్టులో భూమా అఖిలప్రియ మళ్లీ పరాభవం.. బెయిల్ నిరాకరణ

Posted: 01/18/2021 10:51 PM IST
Bowenpally kidnap case ap former minister bhuma akhila priyas bail plea rejected

(Image source from: Tv9telugu.com)

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో మరోమారు పరాభవం ఎదురైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని అమె తరపున దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. వారం రోజుల కిత్రం గత సోమవారం దాఖలు చేయగా కొట్టివేసిన బెయిల్ పిటీషన్ ను ఇవాళ అమె తరపు న్యాయవాదులు మరోమారు దాఖలు చేశారు. అయినా న్యాయస్థానం అమె బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది, జాతీయ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు సహా ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో అమె ఏ1గా వున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ నగరంలోని హపీజ్ పేట్ భూముల వ్యవహారానికి సంబంధించిన వారిని అపహరించిం వారితో పలు డాక్యూమెంట్లపైన సంతకాలు చేయించుకున్నారని అభియోగాలను ఎదుర్కోంటోంది. కిడ్నాప్ కేసులో అరెస్టైన అమె గర్భవతి అని అమెకు నిత్యం వైద్యుల పర్యవేక్షణ అవసరమని అమె తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా .. అమెకు బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. వ్యక్తుల అపహరణ కేసులో అభియోగాలను ఎదుర్కోంటున్న వ్యక్తులకు అంత త్వరగా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అఖిలప్రియ తరపు న్యాయవాదులు అమె ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరారు.

కాగా, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, కావాలనే కేసులో ఇరికించారని అఖిలప్రియ తరుపు న్యాయవాదులు వాదించగా… అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను మార్చే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. తమ కస్టడీలోనూ అఖిల ప్రియ తమ విచారణకు సహకరించలేదని పోలీసులు తెలిపారు. ఇక ఏ1గా వున్న అమెకు బెయిల్ ఇచ్చిన పక్షంలో సాక్యాధారాలు తారుమారు చేసే అవకాశం వుందని తెలిపారు. ఇక సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియకు రెండు పర్యాయాలు బెయిల్ రాకపోవడంతో అమె తరపు న్యాయవాదులు నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించేందుకు సిధ్దం అవుతున్నారు. ఇక ఈ కేసులో నిందుతులగా అభియోగాలు ఎదుర్కోని తప్పించుకుని తిరిగుతున్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సహా అఖిలప్రియ సోదరుడు చంద్రహాస్ ల కోసం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles