దేశ రాజధానిలో తన సత్తాను చాటిన అమ్ ఆద్మీ పార్టీ రెండో పర్యాయం కూడా అధికారంలోకి రాకముందే అటు పంజాబ్, ఇటు హర్యానా సహా పలు రాష్ట్రాల్లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. పంజాబ్ లో ఉనికి చాటుకున్నా.. అది కేవలం పట్టన ప్రాంతాలకు మాత్రమే పరిమితం య్యింది. కాగా ఇక తాజాగా దేశ అర్థిక రాజధాని వుండే ముంబై వుండే మహారాష్ట్రలోనూ సత్తా చాటింది. చాప కింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో అప్ తన ఉనికి చాటుకోగలిగింది. పలు జిల్లాల్లో మాత్రం గణనీయమైన సంఖ్యలోనే స్థానాలను కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 96 సీట్లు సాధించి సత్తా చాటింది.
మహారాష్ట్రలో ఎన్నికలలో తొలిసారి అందులోనూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన అప్ క్షేత్రస్థాయిలోనే పార్టీని బలోపేతం చేసి ఉనికి చాటుకుంటూ ఖాతా తెరిచింది. విజయం సాధించిన 96 స్థానాల్లో 41 స్థానాలను ఒక్క యవత్మాల్ జిల్లా నుంచే గెలుపొందడం విశేషం. మొత్తంగా 13 జిల్లాల్లోని 300 స్థానాలకు ఆప్ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. కాగా బరిలోకి దింపిన అభ్యర్థులలో మూడింట ఒక వంతు అభ్యర్థులను ప్రజలు విజేతలుగా నిలిపారు. లాతూర్, నాగ్ పూర్, షోలాపూర్, నాశిక్, గోండియా, చంద్రాపూర్, పాల్ఘర్, హింగోలి, అహ్మద్ నగర్, జల్నా, యవత్మాల్, పర్భానీ జిల్లాల్లో గెలుపు ఖాతా తెరిచింది. రాజకీయాలతో సంబంధం లేని సంఘాలతో జట్టు కట్టి మరో 13 స్థానాలను కైవసం చేసుకుంది.
వచ్చే ఏడాది రానున్న బృహన్ ముంబై (గ్రేటర్ ముంబై) కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్ కు ఈ ఎన్నికలు మంచి జోష్ ను ఇచ్చాయి. కాగా, 34 జిల్లాల్లోని 14 వేల గ్రామపంచాయతీలకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. అయితే, 3,276 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు. అయితే, తాము 6 వేలకుపైగా పంచాయతీలను గెలిచామని, తామే అతిపెద్ద పార్టీ అని బీజేపీ ప్రకటించుకుంది. మహా వికాస్ అఘాడీలోని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ లు కలిపి గెలిచిన స్థానాల్లో 20 శాతం కూడా బీజేపీ గెలవలేదని పాటిల్ అన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన వారిలో లక్షా 25 వేల మంది అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more