High Court reserves verdict on Panchayat Elections ఏపీ ఎన్నికల 'పంచాయితీ'పై తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

Panchayat poll schedule ap high court reserves verdict on panchayat elections

State Election commissioner, Nimmagadda Ramesh Kumar, Gram panchayat elections, Postponement of GP elections, GP election shedule, chief secretary, Adithyanath, High Court, Gopala Krishna dwivedi, public Health, panchayat raj secretary, YS Jagan Mohan Reddy, chief Minister, Andhra Pradesh, YSRCP, TDP, Politics

The Andhra Pradesh High Court Division Bench reserves the judgement on panchayat polls on a single judge’s verdict over the suspension of schedule announced for panchayat polls by the State Election Commission (SEC). The Verdict is reserved and may be delivered in a week.

ఏపీ ఎన్నికల ‘పంచాయితీ’పై తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

Posted: 01/19/2021 09:26 PM IST
Panchayat poll schedule ap high court reserves verdict on panchayat elections

(Image source from: Thehindu.com)

ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన తరువాత దానిని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ పంచాయితీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సింగిల్ జడ్జీ పంచాయితీ ఎన్నికలపై స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటీషన్ దాఖలు చేశారు, ఈ పిటీషన్ పై విచారణను ఇవాళ రాష్ట్రోన్నత న్యాయస్థాన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.

ఈ కేసులో సుప్రీంకోర్టుకు చెందిన న్యాయవాది ఆదినారాయణ రావు, మాజీ అడ్వకేట్ జనరల్ డివి సీతారామమూర్తి రాష్ట్ర ఎన్నికల కమీషన్ తరపున నిన్న తమ వాదానలను వినిపించారు, కాగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఇవాళ తన వాదనలు వినిపించారు, రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటీషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. అంతకుముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇంప్లీడ్ పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక నిన్న జరిగిన వాదనలకు ఇవాళ కూడా ప్రభుత్వం తరపున వాదనలు కోనసాగింపు జరిగిన అనంతరం న్యాయస్థాన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది,

కాగా, వారం రోజుల వ్యవధిలో పంచాయితీ ఎన్నికలపై తీర్పు వెలువడే అవకాశముందని హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. వాదనల గురించి చెబుతూ.... గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసే అధికారం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదించారని, ఇవాళ ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అందుకు ప్రతివాదనలు వినిపించారని రాజేంద్రప్రసాద్ వివరించారు. ఈ కేసులో రిట్ అప్పీల్ చేసే వీలుందని ఎన్నికల సంఘం న్యాయవాది స్పష్టం చేశారు. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పు చట్టాన్ని అతిక్రమించేదిగా ఉందని, ఎన్నికలు జరపాలని చెప్పడం, జరిపించడం అనేది రాజ్యాంగ విధి అయినప్పుడు ఆ విధిని పాటిస్తున్న ఎన్నికల సంఘానికి అడ్డుతగలడం రాజ్యాంగ వ్యతిరేకం అని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles