కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్ కు వేళ్లాడుతున్న స్థితిలో గుర్తించారు. అమెది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీర్ఘకాలికంగా అమె మానసిక ఒత్తడికి గురయ్యారని, దానిని అధిగమించేందుకు చికిత్స పోందుతున్న ఆమె.. చివరకు దానికే బలయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
బెంగళూరులో మగది రోడ్ లోని ప్రగతి లే అవుట్ లో నివసిస్తున్న జయశ్రీ.. కన్నడ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా బిగ్ బాస్ సీజన్ 3లో అమె ప్రవేశించి రాష్ట్రప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న తరువాత కూడా అమెకు సినిమా అవకాశాలు మాత్రం ఆశించినంతగా దక్కలేదు. దీంతో అమె మానసిక ఒత్తడికి గురైంది. ఈ క్రమంలో గత ఏడాది జూలై నెలలో అమె పెట్టిన ఓ ట్వీట్ కూడా పెను సంచలనంగా మారింది. ఈ ప్రపంచం నుంచి, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పోందాలని భావిస్తున్నాను.. గుడ్ బై అంటూ ఓ పోస్టు పెట్టింది. ఆ తరువాత అమెకు అండగా నెట్ జనులు కామెంట్లు చేయడంతో దిగివచ్చి దానిని తొలగించిన నటి తాను క్షేమంగానే వున్నానని పేర్కోంది.
ఇక డిప్రెషన్ ను అధిగమించేందుకు అమె స్థానిక సంథ్య కిరాణా ఆశ్రమంలో చేరి చికిత్స కూడా తీసుకుంటోంది. ఇక అంతా సర్ధుకుంటోంది అన్న తరుణంలో అమె ఇలాంటి చర్యకు పాల్పడుతుందని అనుకోలేదని అమె స్నేహితురాలు శిల్ప పేర్కోంది. గత రాత్రి నుంచి అమె తన కుటుంబసభ్యుల సందేశాలకు, ఫోన్ కాల్స్ ను స్పందించకపోవడంతో ఆశ్రమాన్ని సంప్రదించగా వారు వెళ్లి చూసే సరికి అమె విగతజీవిలా పడివుందని శిల్ప తెలిపారు. కాగా, జయశ్రీ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నటి మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఆమె మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more