TS Inter Exam 2021 time table released తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. మేడే రోజు నుంచే..

Telangana intermediate 1st 2nd year exam time table released

Telangana Intermediate 1st, 2nd year exam time table, TS Inter Exam 2021, Telangana Inter Exams, TS Inter Time Table, TS Inter Shedule, Intermediate exam time table, Telangana Inter time table, ts inter date sheet, manabadi.co.in, Intermiediate Exams, TS Inter Exam time table, sabitha Reddy, Intermiediate board, Telangana

Education Minister P Sabita Indrareddy has released the TS Inter Exam 2021 time table. The first-year exam would be conducted from May 1 to May 19, 2021, and the second year exam would be conducted from May 2 to May 20, 2021.

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇదే.. మేడే రోజు నుంచే..

Posted: 01/28/2021 06:41 PM IST
Telangana intermediate 1st 2nd year exam time table released

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ప్రపంచ కార్మికుల దినోత్సవం రోజున లేబర్ హాలీడేగా ప్రకటించినా.. అ రోజు నుంచే పరీక్షలను ప్రారంభించడం గమనార్హం. మేడే అనగా మే 1వ తేదీ మొదలుకుని మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. మే డే రోజున మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతుండగా, మే 20 రెండవ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి,

ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. కోవిడ్ నేపథ్యంతో విద్యార్థులందరూ జాగ్రత్త చర్యలు పాటిస్తూనే పరీక్షలకు హాజరుకావాల్సిందిగా బోర్డు పేర్కోంది. ఇక ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఏప్రిల్‌ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకేషనల్‌ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్‌ వర్తించనున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

సబెక్డు ఇంటర్ 1st ఇయర్ ఇంటర్ 2nd ఇయర్
సెకెండ్ లాంగ్వేజ్  1/5/2021 2/5/2021
ఆంగ్లం  3/5/2021 4/5/2021
గణితం/బోటనీ/ సివిక్స్/ సైకాలజీ 5/5/2021 5/5/2021
గణితం బి/ జువాలజీ/ హిస్టరీ 7/5/2021 8/5/2021
ఫిజిక్స్/ ఎకానమిక్స్/క్లాసికల్ లాంగ్వేజ్ 10/5/2021 11/5/2021
కెమిస్ట్రీ/ కామర్స్/ సోషియాలజీ/ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ 12/5/2021 13/05/2021
జియాలజీ/ హోంసైన్స్/ పీఏ/లాజిక్/బ్రిడ్జ్ కోర్స్ గణితం (బైపిసీ) 17/05/2021 18/05/2021
మోడ్రన్ లాంగ్వేజ్/జాగ్రఫీ 19/05/2021 20/05/2021

 

అటు సిబీఎస్ఈ పరీక్షల షెడ్యూలును ఫిబ్రవరి 2వ తేదీన వెల్లడించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. సీబీఎస్‌ఈ 10,12వ తరగతుల బోర్డు పరీక్షలను ఈ ఏడాది మే 4 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించనున్నట్టు ఇదివరకే ఆయన వెల్లడించారు. అయితే ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా.. అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఈ పరీక్ష ఫలితాలు జులై 15న వెల్లడిస్తామని ఆయన చెప్పారు. కాగా 2021లో బోర్డు పరీక్షలను ఆన్ లైన్లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles