బ్రిటన్ లో కరోనా మహమ్మారి కొత్త రూపు దాల్చి అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చాటుతూ వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా అందోళన రేకెత్తుతోంది. కరోనా మహమ్మారి నియంత్రణకు వాక్సీన్ వచ్చిన క్రమంలో అది కొత్త రూపు సంతరించుకోవడంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో కొత్త స్ట్రెయిన్ వుందా.? లేదా అన్న పరిశోధనలను ప్రారంభించాయి, ఇక ఈ నేపథ్యంలో భారత్ లో కొత్త స్ట్రెయిన్ పై అధ్యయానాలు జరుగుతున్న క్రమంలో మరో విభిన్నమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో సీఐఎస్ఆర్ నిర్వహించిన అద్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ లోని పలు రకాల వైరస్ కన్నా ఇది బలహీనంగానే వుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. దీనిని ఎన్ 440కె గా నామకరణం చేసినట్టు తెలిపారు. శంలో ఈ రకం వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో నిర్ధారించేందుకు పరిశోధనను ముమ్మరం చేయనున్నట్లు వివరించారు. ఈ తరహా కరోనా వైరస్ దక్షణాధి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోందని అన్నారు.
కాగా, ఇది పూర్తిగా కోత్త రకం కాదని, కొంతకాలంగా వ్యాప్తిలో ఉంది. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో స్వల్ప కేసుల్లోనూ ఎన్440 కె కరోనా వైరస్ కనిపించిందని అన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మందికి ఈ తరహా వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఎన్440కే రకం కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు పెద్దగా ఉండటం లేదని అన్నారు. స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. మునుపటి వైరస్ బలహీనపడి ఉండటంతో ఇది ఉత్పన్నమై ఉండొచ్చునని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ రకంపై కరోనాపై తమ వద్ద పెద్దగా డేటా అందుబాటులో లేదన్న ఆయన రానున్న రోజుల్లో భారీ స్థాయిలో వైరస్ జన్యుక్రమాలను ఆవిష్కరించి, మరిన్ని వివరాలు వెలుగులోకి తెస్తామని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more