Temple dedicated to Jayalalithaa, MGR inaugurated మధురైలో మాజీ సీఎం జయలలిత ఆలయం..

Temple dedicated to jayalalithaa mgr inaugurated by cm palanisamy

Jayalalithaa, Jayalalithaa Temple, MG Ramachandran Temple, Madurai, Tamil Nadu CM, Edupati Palanisami, Tamil Nadu Revenue Minister, RB Udhaykumar, TN Assembly Elections, Bronze Statues, Tamilnadu Politics

Tamil Nadu chief minister Palaniswami inaugurated the temple dedicated to late chief minister J Jayalalithaa and her mentor MG Ramachandran today. The inauguration had taken place just a couple of months ahead of the election which is taking place first after AIADMKA chief's death. State Revenue Minister RB Udhaykumar commissioned the temple and constructed it in one and a half acre with a cost of Rs 50 lakh.

మధురైలో మాజీ సీఎం జయలలిత ఆలయం.. ప్రారంభించిన పళనిస్వామి

Posted: 01/30/2021 03:27 PM IST
Temple dedicated to jayalalithaa mgr inaugurated by cm palanisamy

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, పురచ్చి తలైవిగా ప్రజలు పిలుచుకునే అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా కొనసాగిన జయలలిత ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో ఆమె రాజకీయ గురువు, ఏఐఐడిఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ విగ్రహం కూడా కొలువైంది. మదురైలోని కల్లుపట్టి ప్రాంతంలో ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలోని స్థలంలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. జయలలిత మంత్రిమండలిలో కొనసాగిన ప్రస్తుతం తమిళనాడు రెవెన్యూ మంత్రి ఉదయకుమార్ ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయలలితను తాము పలు పేర్లతో దేవతగా ఆరాధిస్తామని అన్నారు. అమె తమ హృదయ దేవతగా, గార్డియన్ దేవతగా, తమ కుల దేవతగా కడా ఆరాధిస్తామని అన్నారు. జయలలితను కొలిచే భక్తులకు ఈ దేవాలయం న్యాయం చేస్తోందని అన్నారు, ఈ ఆలయంలో సందర్శకులకు పూజలు చేయడానికి తగినంత స్థలంతో నిర్మాణం జరుగుతుంది. ఎంజీఆర్, జయలలిత ఇద్దరూ ఈ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన త్యాగధనులేనని ఆయన పేర్కోన్నారు, దీంతో వారిని దేవతామూర్తులుగా ఆరాధించడంలో ఎలాంటి తప్పులేదని అన్నారు,


ఇటీవలే రూ. 80 కోట్ల రూపాయలతో నిర్మించిన జయలలిత స్మారక మొమోరియల్ ను చెన్నైలోని మెరినా బీచ్ వద్ద నిర్మించిన విషయం తెలిసిందే. అదేవిధంగా, చెన్నైలోని లేడీ వెల్లింగ్టన్ కళాశాలలో జయలలిత పూర్తి నిడివి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటు అమె తను నివసించిన పాయిస్ ఎస్టేట్ లోని వేద గృహాన్ని కూడా ప్రజలకు సందర్శనార్థం తెరిచారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని జయలలిత కోసం ప్రారంభిస్తున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో రావడంతో, ఇలాంటివి మెరుపు వేగంతో జరుగుతుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles