కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2021-22 ఆర్థిక బడ్జెన్ ను ప్రవేశపెట్టారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంది. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేలా వుందీ బడ్జెట్. ఇక దీనికి తోడు పలు రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా అహ్వానించారు. మరికోన్ని రంగాల్లో విదేశీ పెట్టబడుల శాతాన్ని పెంచారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని కీలక అంశాలు..
మూలధన వ్యయం 5.34 లక్షల కోట్లు
* రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం రూ. 5 వేల కోట్లు
* స్కిల్ డెవలప్ మెంట్ కు రూ. 3 వేల కోట్లు
* ఆరోగ్య రంగానికి 137 శాతం నిధుల పెంపు
* ఎలక్ట్రానిక్ పేమెంట్లను పెంచేందుకు రూ. 1,500 కోట్లు
* నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 1,500 స్కూళ్ల అభివృద్ధి
* కొత్తగా మరో 750 ఏకలవ్య పాఠశాలలు
* అదనంగా 100 సైనిక స్కూళ్ల ఏర్పాటు
* వ్యవసాయ మౌలిక నిధి ఏర్పాటు
* ఈ నిధితో మౌలిక సౌకర్యాల పెంపు
* ఒకే వ్యక్తి సార్థ్యంలోని కంపెనీలకు అనుమతులు
* ఒకే దేశం ఒకే రేషన్‌కార్డు విధానం దేశంలో అన్ని ప్రాంతాల్లో అమలు
* వలస కార్మికులకు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం
* కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం రేషన్
* రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలే
* కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి
* రూ. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి
* 15వ ఆర్థిక సంఘం సూచనల ప్రకారం కేంద్ర పథకాల హేతుబద్ధీకరణ
* 2021-22లో బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, ఐడీబీఐల అమ్మకం పూర్తి
* ఈ సంవత్సరమే ఎల్ఐసీ ఐపీవో
* మూలధన సహాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20వేల కోట్లు
* మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్
* గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ
* స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం
* ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000 కోట్ల టార్గెట్
* రెగ్యులేటర్ గోల్డ్ ఎక్సే్ఛంజీల ఏర్పాటు
* ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
* బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు
* 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
* రూ. 3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
* రూ. 18 వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం
* వాహనరంగం వృద్ధి చర్యలు
* కొచ్చి మెట్రో రెండో దశకు కేంద్రం సాయం
* చెన్నై మెట్రోకు రూ. 63,246 కోట్లు
* బెంగళూరు మెట్రోకు రూ.14,788కోట్లు
* 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
* ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట కోస్ట సరకు రవాణా కారిడార్
* రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు
* 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి
* దేశంలోనే తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు
* జనగణనకు రూ. 3,678 కోట్ల కేటాయింపు
* ఆర్థిక రంగ పునరుత్తేజానికి రూ. 80 వేల కోట్లు
* 2021-2022 ద్రవ్యలోటు 6.8 శాతం
* 2025 నాటికి 4.8 శాతం టార్గెట్
* గోవా డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం రూ. 300 కోట్లు
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు
* రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ. 2 లక్షల కోట్లు
* విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ వ్యవస్థలు
* డిస్కమ్ లకు రూ. 3,05,984 కోట్ల సాయం
* హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నాం
* ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ. 1,624 కోట్లు
* నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
* బీమా రంగంలో ఎఫ్‌డీఐల శాతం 49 నుంచి 74 శాతానికి పెంపు
* త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ
* పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు అదనంగా రూ. 20 వేల కోట్ల సాయం
* 2022 నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
* ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ రవాణా కారిడార్ ఏర్పాటు
* రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ. 1,01,055 కోట్లు
* 2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి
* దేశ వ్యాప్తంగా విశాఖ సహా ఐదు చోట్ల ఆధునిక ఫిషింగ్ హార్బర్లు
* చెన్నై, విశాఖల్లో మేజర్ హార్బర్లు
* పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం
* మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు. ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలను నిర్వహించనున్న బ్యాడ్ బ్యాంక్.
* వ్యవసాయ రంగానికి రూ. 75,100 కోట్లు
* వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.50 లక్షల కోట్లు
* రూ. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక వసతులు
* వన్ నేషన్-వన్ రేషన్ తో 69 కోట్ల మందికి లబ్ధి
* మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు
* దేశ వ్యాప్తంగా 15 వేల ఆదర్శ పాఠశాలలు, 100 సైనిక్ స్కూళ్లు.
* ఆరోగ్య రంగానికి పెద్దపీట
* 100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
* కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
* మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్
* కొత్తగా బీఎస్ఎల్-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
* వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
* రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
* 2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
* 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్
* రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more