రాష్ట్రంలో హింసాత్మక శక్తులను ఏరిపారేస్తూ వారందరిలో మార్పు తీసుకువచ్చేలా ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ అదిత్యానాథ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని.. ఇక పాశ్చత్య సంస్కృతికి పట్ల రాష్ట్ర ప్రజలు అకర్షితులు అవ్వకుండా మోరల్ పోలీసింగ్ చర్యలకు కూడా శ్రీకారం చుడుతున్నామని, మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ప్రభుత్వ అశయాలను మాత్రం సదాలోచనలు మాత్రం ఆయా శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది విచ్చిన్నం చేస్తున్నారని చెప్పడంలో సందేహమే లేదు.
ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అది పోలీసు శాఖ గురించే. సామాన్యు నుంచి చోటా మోటా లీడర్ల వరకు అందరికీ పోలీసులంటే.. ఆమ్మో పోలీసులు అన్న భయం మాత్రం నెలకొని వుంటుంది. అందుకు కారణం చట్టం వారి చేతుల్లో వుంది.. ఎలా పడితే అలా వాడేస్తారని.. ఎదురు ప్రశ్నిస్తే.. లాఠీలకు పనిచెబుతారన్న భయమూ నెలకొంది. ఇక ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో స్టేషన్ కు వెళ్తే.. వారి చేతులు తడపందే ఎలాంటి పనులు ముందుకు సాగవన్న అరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అలా అని డబ్బులిచ్చినా.. పనులు జరుగుతాయన్న నమ్మకం లేదు. వారి నిర్లక్ష్యపు సమాధానాలు అందరికీ తెలిసిందే. యూపీలోనీ ఓ దివ్యాంగురాలికి ఎదురైన అనుభవం పోలీసుల ధనదాహానికి, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
తన బిడ్డను తన బంధువైన ఓ వ్యక్తి అపహరించాడని, అమెను వెతికి పెట్టండీ అని ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో కి 80 కిలోమీటర్ల దూరంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఓ బాధితురాలి పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారు. దివ్యాంగురాలన్న కనీస కనికరం కూడా లేకుండా అమె నుంచి కూడా డబ్బులు లాగారు. కన్న పాశం కోసం అమె బంధువుల వద్ద అప్పు చేసి మరీ రూ. 15 వేల వరకు తీసుకువచ్చి ఇచ్చింది. అయినా అమె బిడ్డను వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. అంతటితో ఆగని వారు తన బిడ్డ జాడ అడిగిన అమెను చీదరించుకుంటూ.. అమె కూతురు మంచిది కాదని అసభ్యంగా మాట్లాడారు.
దీంతో ఉన్నాతాధికారులు అమె పిర్యాదుపై వేగంగా స్పందించారు. యూపీలో పోలీసుల వ్యవహరశైలిని ప్రశ్నిస్తున్నట్లుగా వున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఉన్నతాధికారులను కలిసే క్రమంలో అమెను కదిలించగా అమె తన బాధను వెళ్లబోసుకుంది. అంతే ఈ వీడియో వేగంగా వైరల్ అయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ పోలీసు తీరుపై నెట్ జనులు తీవ్రంగా విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. దీంతో ఉన్నతాధికారులు బాధితురాలి పిర్యాదుపై స్పందించారు. వెంటనే అమె పిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ తో పాటు డీజిల్ కు డబ్బులు అడిగిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. బాధితురాలి పిర్యాదును నమోదు చేసుకుని అమె బిడ్డ అచూకీ కోసం వెతుకుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more