కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనోద్యమన్ని చేపడుతున్న సుమారు మూడు నెలలుగా దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలలో పెద్దస్థాయిలో మోహరించి నిరసన తెలుపుతున్న రైతులు మరోమారు దేశవ్యాప్త అందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారిని కేంద్రం అదేశాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దిగ్భంధనం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోని పక్షంలో తాము హస్తిన శివార్లను వీడి వెళ్లబోమని తేల్చిచెబుతున్న రైతు సంఘాలు.
ఈనెల 6వ తేదీన శనివారం రోజు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భంధనం (చక్కా జామ్) చేయనున్నామని రైతు సంఘాలు పిలుపునివ్వడంతో వారికి ఢిల్లీకి వచ్చే రహదారుల నుంచి వేరు చేస్తూ దిగ్భంధనం చేశాయి. మరోమారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. అయితే ఈ చర్యలతో రైతులకు కనీస అవసరాలు అందకుండా పోతున్నాయి. టిక్రీలో చెత్తాచెదారంతో రైతులు అందోళన చేస్తున్న ప్రాంతాలు నిండుకున్నాయి. అక్కిడికి గత రెండు రోజులుగా సఫాయి కార్మికులు రావడం లేదని రైతులు తెలిపారు.
రైతులకు మంచి నీటి సరఫరాను నిలిపివేయడంతో పాటు, వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా చేశారు. నాలుగు నుంచి ఐదడుగుల సిమెంట్ గోడలను నిర్మించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా నిరసనకారులకు ఢిల్లీతో ఎటువంటి సంబంధం లేకుండా చేశారు. మొత్తం ఐదు వరుసల్లో బారికేడ్లను నిర్మించారు. 1.5 కిలోమీటర్ల దూరం పాటు వీటిని నిర్మించారు. రైతులు టాయిలెట్ అవసరాలను వినియోగించుకునేందుకు పదికి పైగా మొబైల్ టాయిలెట్ వాహనాలను అక్కడ ఏర్పాటు చేయగా, వాటి వద్దకు వెళ్లకుండా రైతులను నియంత్రించారు. ఢిల్లీ జల్ బోర్డు వారికి నిత్యమూ మంచినీటిని సరఫరా చేస్తుండగా వాటిని కూడా నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా భారీ ఎత్తున అడ్డుగోడలు కట్టారు.
పోలీసుల చర్యలతో రైతులు అయోమయ పరిస్థితుల్లో పడినా, తామేమీ వెనుకంజ వేయబోమని, పోలీసుల చర్యలు తమ నిరసనలను ఆపలేవని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. "మేము రైతులము. మేము బావులు తవ్వకుంటాం. మా అవసరాలను మేమే తీర్చుకుంటాం. మా గురించి ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదు. మా గ్రామాలకు మేమిప్పుడు వెనక్కు తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతాం" అని రైతు సంఘం నేత కుల్జిత్ సింగ్ వ్యాఖ్యానించారు.
అపరిష్కృత డిమాండ్లతో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనుదిరిగే పరిస్థితి లేదని రైతులు తేల్చిచెబుతున్నారు, ఇక వారిని కలిసేందుకు మీడియా ప్రతినిధులు కూడా పోలాల నడకబాటలో నడిచి వెళ్లాల్సివస్తుంది. కాగా, రైతుల దైనందిన అవసరాలను తీర్చేందుకు హర్యానా ప్రభుత్వం కొన్ని వాటర్ ట్యాంకర్లను పంపించింది. కాలకృత్యాల అవసరాలను తీర్చేందుకు కొన్ని టాయిలెట్లు మాత్రమే ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టామని హర్యానా అధికారులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more