వీకెండ్ వచ్చిందంటే చాలు.. వాహనదారులు రెండు రోజుల సెలవులను శుక్రవారం సాయంత్రం మద్యం పార్టీతోనే ప్రారంభిస్తారు. పాశ్చాత్య సంస్కృతి అంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిట్టిపోసే వారు కూడా.. శుక్రవారం సాయంత్రం కాగానే మద్యం బాటిల్ ముందు పెనం ముందు వేసిన ఐస్ ముక్కలా జావగారిపోతారు. ఇక ఈ సంస్కృతిని ప్రభుత్వాలే పోంచిపోషిస్తున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం కావాలంటే.. ప్రతీ పౌరుడు మద్యం తాగాల్సిందేనని కూడా భవిష్యత్తులో చట్టాలను తీసుకువచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
దీంతో ఈ మందుబాబులతో పోలీసులకు పని ఎక్కువవుతోంది. కరోనాకు ముందు వరకు నగరంలో ప్రజలు గాడిన పడ్డారని సంబరపడిన పోలీసులు.. ఇక ఇప్పుడు మళ్లీ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదిని మళ్లీ డ్రంక్ అండ్ డ్రవ్ చెక్ లకు సిద్దమయ్యారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని గత కొన్నేళ్లుగా వాహనదారుల చెవుల్లో గూడు కట్టుకుని మరీ చెబుతున్నా.. కరోనాకు ముందు కాసింత పరిస్థితిలో మార్పు వచ్చినా.. అడపాదడపా మందుబాబులు అడ్డంగా దోరికేవారు. కానీ కరోనా తరువాత మళ్లీ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో పోలీసులు చెక్ పాయింట్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు.
ఇలా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తనీఖీ చేస్తున్న పోలీసులకు జబర్థస్త్ లేడీ గెటప్ నటి తన్మయ్ అడ్డంగా దొరికిపోయింది. అమెతో పాటు మరో కారులోనూ వచ్చిన ఈవెంట్ అర్గనైజర్స్ ఎనమిది మంది పోలీసులకు చిక్కిపోయారు. అయితే డ్రైవింగ్ సీటులో వున్న వారిని పోలీసులు అల్కహాట్ టెస్టు నిర్వహించగా వారు తాగివున్నారని నిర్థారించారు. ఇలా మద్యం సేవించి కారును నడుపుకుంటూ వచ్చిన అర్టిస్టులలో తన్మయ్ కూడా వున్నారు. దీంతో పోలీసులను కాసింత సేపు అమె బతిమాలినా.. వారిపై కేసు నమోదు చేయకుండా పోలీసులు వదిలిపెట్టడం సాధ్యం కాదని చెప్పారు.
ఇదిలావుండగా అదే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద మరో వాహనంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కొందరు యువతులు పట్టుబడ్డారు. వారు తాము రాష్ట్ర హోం మంత్రి మహమ్మూద్ అలి బంధువులమని.. తమకో పెట్టుకోవద్దని పోలీసులనే హెచ్చరించారు. అయినా పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇక శుక్రవారం రాత్రి . వెస్ట్ జోన్ జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహించిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో 5 కార్లు , 2 ఆటోలు, 12 బైక్లను పోలీసులు పట్టుకున్నారు. ఇక శని, ఆదివారాల్లో మరెందరు పట్టుబడతారో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more